నేతాజీ హైస్కూల్ రోడ్డు మూసివేత
ABN , Publish Date - Jan 29 , 2024 | 01:19 AM
క్రాంబ్వేరోడ్డుకు అనుసంధానంగా ఉన్న నేతాజీహైస్కూల్ రోడ్డులో ఓ వ్యక్తి అడ్డంగా రేకుల పెట్టి రాకపోకలను నియంత్రించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద కుటుంబాల వారు మహిళలతో సహా క్రాంబ్వేరోడ్డుకు అడ్డంగా బైఠాయించి నినాదాలు చేశారు.
రోడ్డుపై బైఠాయించి స్థానికుల ఆందోళన
విద్యాధరపురం, జనవరి 28: క్రాంబ్వేరోడ్డుకు అనుసంధానంగా ఉన్న నేతాజీహైస్కూల్ రోడ్డులో ఓ వ్యక్తి అడ్డంగా రేకుల పెట్టి రాకపోకలను నియంత్రించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద కుటుంబాల వారు మహిళలతో సహా క్రాంబ్వేరోడ్డుకు అడ్డంగా బైఠాయించి నినాదాలు చేశారు. యాభై ఏళ్లుగా ఇదే రోడ్డులో ఉంటూ రాకపోకలు సాగిస్తున్నామని, తాజాగా ఒక వ్యక్తి రేకులు పాతి రాకపోకలను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పశ్చిమ ఇన్‌చార్జి షేక్ ఆసిఫ్, 42వ డివిజన్ కార్పొరేటర్ పి.చైతన్యరెడ్డి, 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష అక్కడకు చేరుకుని ఆందోళనకు మద్దతు పలికారు. రోడ్డును ఇష్టా నుసారం మూసివేయడం సరికాదని, సమస్యకు పరిష్కారం చూపుతామని నాయకులు హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని మునిసిపల్ కమిషనర్, జిల్లా కలె క్టర్ల దృష్టికి తీసుకువెళతామని, రోడ్డును యథాతథస్థితికి తెచ్చేందుకు ప్రయ త్నిస్తామని తెలిపారు. దీంతో స్దానికులు ఆందోళన విరమించారు. నగర పాలకసంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది అక్కడకు వచ్చి రేకులను తొలగించారు.