సిద్ధేంద్రయోగికి నాట్య నీరాజనం
ABN , Publish Date - Dec 28 , 2024 | 12:46 AM
సిద్ధేంద్ర కళాపీఠంలో కూచిపూడి స్వర్ణోత్సవాల పేరిట కూచిపూడి నాట్యోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా కూచిపూడి నాట్యోత్సవాలు ప్రారంభం
కూచిపూడి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): కూచిపూడి హెరిటేజ్ సొసైటీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కేంద్ర సాంస్కృతిక శాఖ, రాష్ట్ర క్రియేటివ్ అండ్ కల్చర్ మిషన్ సహకారంతో సిద్ధేంద్ర కళాపీఠంలో కూచిపూడి స్వర్ణోత్సవాల పేరిట ఏర్పాటు చేసిన కూచిపూడి నాట్యోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులతో పాటు ప్రవాస భారతీయులు నాట్యప్రదర్శనలతో సిద్ధేంద్రయోగికి నాట్య నీరాజనా లు అర్పించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, కూచిపూడి నాట్య కళాపీఠం వైస్ ప్రిన్సిపాల్ చింతా రవిబాలకృష్ణ నృత్య దర్శకత్వంలో అం బాపరాకు, దేవి పరాకు, గణపతి నర్తనం అంశాలతోపాటు మోహిని భస్మాసుర నృత్యరూపకం ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపచేశారు. మృణాళిని సలాది శిష్యబృందం బాలార్క కోటి అం శాన్ని కల్యాణరాగం, ఆదితాళంలో ప్రదర్శించి మె ప్పించారు. పసుమర్తి మృత్యుంజయశర్మ సూర్యస్తుతి అంశాన్ని శౌరాష్ట రాజ్యం, రూపకతాళంలో చూపిన హావభావాలు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని గావించాయి. పద్మరాగిని పుట్టు బృందం పరిపాహి గణదిపా, జగదానంద కారక అంశాలను, నాగజ్యోతి శివతరంగం అంశాన్ని, జయజయదుర్గే, నారాయణ తీర్థుల తరంగం అంశాలను సుధీర్‌రావు ప్రదర్శించారు. మహాగణపతిం, ఆడరో, పాడరో అన్నమాచార్య కీర్తనను జ్వాలశ్రీ కళ ప్రదర్శించారు. పసుమర్తి రామలింగశాస్త్రి శిష్య బృందం యామినీరెడ్డి, కేపీ విశ్వనాథ్ అర్ధనారీశ్వర స్తోత్రం, అఖిలాండేశ్వరి అంశాలను ప్రదర్శించి మెప్పించారు. మాడబూసి రమణసిద్ధి శిష్యబృందం అముక్తమాల్యద నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ఉత్సవ కమిటీ కన్వీనర్ వేదాంతం నాగ వెంకటచలపతి కళాకారులను సత్కరించారు. సర్పంచ్ కొండవీటి విజయలక్ష్మి, కళాకారులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికారణంగా ప్రజాప్రతినిఽధులు, ఉన్నతాధికారు లు హాజరు కాలేకపోయారు.