Share News

పేరుకే..పంట కాలువ!

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:48 AM

వందలాది ఎకరాలకు సాగు నీరందించే వలివర్తిపాడు పంట కాలువ పూడుకుపోయింది. గృహాలు, ఫ్యాక్టరీల నుంచి వదిలే మురికి నీటితో కలుషితమైపోయింది. పూడిక, వ్యర్థాల పారబోత కారణంగా వర్షాకాలంలోనూ సాగునీరందక కాలువ కింద పొలాలు సాగుచేస్తున్న రైతాం గం సతమతమైపోతోంది. సాగు అవసరాలకే కాకుండా, తాగునీటి కోసమూ వినియోగించే ఈ కాలువలో మురుగు నీటి కారణంగా గ్రామ ప్రజానీకం ఇబ్బంది పడుతోంది. పూడిక తొలగించాలని అధికారులను కోరుతోంది.

పేరుకే..పంట కాలువ!
వలివర్తిపాడు-మల్లాయిపాలెం మధ్య గుర్రపు డెక్కతో పూడుకుపోయిన పంటకాలువ

వర్షాకాలంలోనూ సాగుకు నీరందక వలివర్తిపాడు రైతుల అవస్థలు

గుర్రపు డెక్క, ఇంగ్లీషు గడ్డితో పూడిక

కాలువలో కలుస్తున్న మురుగునీరు

ఆక్రమణలతో బోదెలా మారిన వైనం

అధికారులు పట్టించుకోవడం లేదంటున్న రైతులు

(ఆంధ్రజ్యోతి-గుడివాడ రూరల్‌)

గుడివాడ పక్క నుంచి మల్లాయిపాలెం, వలివర్తిపాడు, మెరకగూడేనికి వెళ్లే వలివర్తిపాడు పంట కాలువ గుర్రపు డెక్క, తూడు, ఇంగ్లీష్‌ గడ్డితో పూడుకుపోయింది. గుడివాడ మునిసి పాలిటీ, గ్రామాలు, ఫ్యాక్టరీల నుంచి వచ్చే మురుగు వదల డంతో పంట కాలువలోకి మురుగునీరు చేరుతోంది. కాలువలో వ్యర్థాలు పారబోయడం, పూడిక కారణంగా వర్షాకాలంలోనూ నీరు పారక సాగుకు పెట్టుకోలేని దుస్థితి రైతులకు దాపురిం చింది. సమస్య పరిష్కరించాలని ఇరిగేషన్‌ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆయకట్టు రైతాంగం వాపోతోంది.

రెండు వైపులా ఆక్రమణలు

కాలువ గట్లను రెండు వైపులా ఆక్రమించేశారని, పెద్ద కాలువ చిన్న పంట బోదెలా మారిపోయిందని రైతులు చెబు తున్నారు. నీటి పారుదల లేక వందలాది ఎకరాలకు నీరందక ఇబ్బంది పడుతున్నామని, అధికారులు కాలువలో తూడు, గుర్రపుడెక్క, ఆక్రమణలు తొలగించాలని వారు కోరుతున్నారు.

అంచనాలు రూపొందించాం..త్వరలో పనులు

పంటకాలువ పూడికతీత పనులకు అంచనాలు రూపొం దించాం. త్వరలోనే కాలువ మరమ్మతులు చేయిస్తాం. తాత్కా లికంగా కొంత భాగం చేయించాం. రైతులకు ఇబ్బంది లేకుం డా చూస్తాం.

- పవన్‌, ఇరిగేషన్‌ ఏఈ

తాగునీటికీ ఇబ్బందులే..

గ్రామంలో తాగునీటి అవసరాలకు ఈ కాలువను ఉపయోగిస్తాం. మురుగు నీరు రావడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నాం. గుర్ర పుడెక్క, ఇంగ్లీష్‌ గడ్డి తొలగిం చాలి. మురుగునీరు రాకుండా చూడాలి.

- గుడివాడ దేవపాలన, వలివర్తిపాడు

Updated Date - Oct 20 , 2024 | 01:49 AM