మైలవరం వైసీపీ ఖాళీ
ABN , Publish Date - Mar 03 , 2024 | 01:24 AM
మైలవరం నియోజకవర్గంలో వైసీపీ కేడర్ దాదాపు ఖాళీ అయ్యింది. వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఇబ్రహీంపట్నం ఎంపీపీ, మరో ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు వార్డు సభ్యులు శనివారం హైదరాబాద్‌లో టీడీపీలో చేరారు. దీంతో మైలవరంలో వైసీపీ కేడర్ దాదాపు కనుమరుగైంది.
టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వసంత
ఆయన వెంట భారీగా చేరిన అనుచరులు
ఇబ్రహీంపట్నం ఎంపీపీతో పాటు భారీగా చేరికలు
ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచులు కూడా..
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : మైలవరం నియోజకవర్గంలో వైసీపీ కేడర్ దాదాపు ఖాళీ అయ్యింది. వసంత కృష్ణప్రసాద్‌తో పాటు ఇబ్రహీంపట్నం ఎంపీపీ, మరో ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు వార్డు సభ్యులు శనివారం హైదరాబాద్‌లో టీడీపీలో చేరారు. దీంతో మైలవరంలో వైసీపీ కేడర్ దాదాపు కనుమరుగైంది.
భారీగా చేరికలు
మైలవరం మండలం నుంచి.. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్దుల్ రహీం, కీర్తిరాయునిగూడెం ఎంపీటీసీ భూక్యా అయ్యా, వైసీపీ మైలవరం మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ నన్నే బాబు, జిల్లా బీసీ కమిటీ సభ్యుడు వేముల దుర్గారావు, వైసీపీ చండ్రగూడెం అధ్యక్షుడు దేవరకొండ ఆంజనేయులు, ప్రత్తిపాటి కిరణ్ టీడీపీలో చేరారు. రెడ్డిగూడెం మండలం నుంచి.. శ్రీరాంపురం సర్పంచి అట్లూరి శ్రీనివాస రావు, నేలపట్ల అంబికా నాగరాజు, చిన్ని తిరుపతిరావు, చిన్ని వలరాజు, చిన్ని రామారావు, వైసీపీ సీనియర్ నాయకులు మౌనికల సాంబశివరావు, పటాపంచల రామారావు, పూల కోటేశ్వరరావు, మడిమల నాగేశ్వరరావు, కొండపల్లి సురేశ్, పూల వెంకటేశ్వరరావు, చామకూర దుర్గాప్రసాద్ తదితరులు టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం నుంచి.. ఇబ్రహీంపట్నం ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న దుర్గాప్రసాద్, వైస్ ఎంపీపీ-1 బండి నాగమణి, తుమ్మలపాలెం సర్పంచి బొమ్ము వెంకటరమణ, జూపూడి సర్పంచి కాకి దేవమాత, మూలపాడు పీఏసీఎస్ చైర్మన్ గౌరినేని గాంధీ, వాసిరెడ్డి హరినాథ్, లంకె గోవిందరాజులు, చెరుకుమల్లి తిరుపతిరావు, చింతల చిట్టిబాబు, చెరుకుమల్లి సీతారామాంజనేయులు, కొక్కిలిగడ్డ నాగరాజు, పోలగంగు రాణి, కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు షేక్ రసూల్, దామెర్ల శ్రీలక్ష్మి తదితరులు టీడీపీలో చేరారు. జి.కొండూరు మండలం నుంచి.. వైసీపీ మండల అధ్యక్షుడు నెల్లూరు లీలా శ్రీనివాస్, కందులపాడు సర్పంచి నెల్లూరు శ్రీదేవి, సూదిరెడ్డి సురేశ్, గార్లపాటి వెంకట్రావు, విజయవాడ రూరల్ నుంచి.. మండల వైసీపీ అధ్యక్షుడు కాటంనేని పూర్ణచంద్రరావు, ముప్పాళ్ల చైతన్యకుమార్, పెద్ది రాంబాయమ్మ, వెలగలేరు వైసీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ చల్లగుంట అజయ్‌కుమార్ తదితరులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.