Share News

నా పేరు ప్రకటించకపోవడం మహదానందం

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:49 AM

టీడీపీ - జన సేన కూటమి తొలి జాబితాలో మచిలీపట్నం పార్లమెంట్‌లో అవనిగడ్డ సీటును ప్రకటించక పోవడంపై మండలి బుద్ధప్రసాద్‌ ఒకింత అస హనం వ్యక్తంచేశారు. 2019లో టీడీపీ ఓటమి చెందిన నాటి నుంచి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బుద్ధప్రసాద్‌ పేరు తొలి జాబితాలో ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన పేరు లేకపోవ టంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.

నా పేరు ప్రకటించకపోవడం మహదానందం

సామాజిక మాధ్యమాల్లో మండలి బుద్ధప్రసాద్‌ ఆవేదనతో పోస్టు

తొలి జాబితాలో అవనిగడ్డ సీటు ప్రకటించకపోవటంపై కినుక

అవనిగడ్డ, ఫిబ్రవరి 24: టీడీపీ - జన సేన కూటమి తొలి జాబితాలో మచిలీపట్నం పార్లమెంట్‌లో అవనిగడ్డ సీటును ప్రకటించక పోవడంపై మండలి బుద్ధప్రసాద్‌ ఒకింత అస హనం వ్యక్తంచేశారు. 2019లో టీడీపీ ఓటమి చెందిన నాటి నుంచి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బుద్ధప్రసాద్‌ పేరు తొలి జాబితాలో ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ ఆయన పేరు లేకపోవ టంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై బుద్ధప్రసాద్‌ స్పందించారు. ‘‘నా పేరు ప్రకటించనందుకు మహదా నందంగా ఉంది. ప్రజల నుంచి వచ్చిన పక్షి లాగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందినట్లు ఉంది. నేను పదవుల కోసం పుట్టలేదు. పద వులు లభించనప్పుడు ప్రజలకు మేలు చేయ టానికి, ఈ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నించానే తప్ప పదవులను అడ్డుపెట్టుకుని దోచుకోలేదు, దాచుకోలేదు. రాజకీయాలకు డబ్బు ప్రధాన మైంది. ఓటరును కొనుగోలుగా రాజకీయ పక్షాలు భావిస్తున్న ఈ తరుణంలో ధనవంతుల కోసం అన్వేషణలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నాబోటి వారు ఎన్నికల్లో నిలబ డాలని భావించటం సమంజసం కాదు. పరిస్థి తులను కార్యకర్తలు, ప్రజలు అర్థం చేసు కోవాలి.’’ అని పార్టీ సోషల్‌ మీడియా గ్రూపు ల్లోనూ, తన వ్యక్తిగత ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ లోనూ ఆయన ఆవేదనతో పోస్టు చేశారు. ఈ పోస్టు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. అవనిగడ్డ సీటును టీడీపీకి ఇస్తారా? లేక జన సేన పార్టీకి కేటాయించారా? అన్న విషయం అర్థం కాక కార్యకర్తలు, రాజకీయ వర్గాలు అయోమయంలో ఉన్నాయి.

Updated Date - Feb 25 , 2024 | 01:49 AM