Share News

యువత తొలి ఓటు చంద్రబాబుకు వేయాలి

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:38 AM

రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి, ఆలోచించి ఓటు హక్కు పొందిన యువ త సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పిలుపునిచ్చారు.

యువత తొలి ఓటు చంద్రబాబుకు వేయాలి
మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమంలో బుద్ధప్రసాద్‌ పిలుపు

అవనిగడ్డ, ఫిబ్రవరి 19 : రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి, ఆలోచించి ఓటు హక్కు పొందిన యువ త సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేయాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ పిలుపునిచ్చారు. సోమవారం అవనిగడ్డలో మై ఫస్ట్‌ ఓట్‌ ఫర్‌ సీబీఎన్‌ కార్యక్రమంలో బుద్ధప్రసాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యువత తొలిసారిగా వేసే ఓటు దేశ, రాష్ట్ర గతిని మార్చేదిగా ఉండాలన్నారు. దేశ, రాష్ట్ర గతిని మార్చగల నేత చంద్రబాబు మాత్రమేనని బుద్ధప్రసాద్‌ అన్నారు. ఎన్నో ఐటీ కంపెనీలు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు కృషి చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీలను తరిమివేశారన్నారు. టీడీపీ నాయకులు మండలి వెంకట్రామ్‌, కొల్లూరి వెంకటేశ్వరరావు, తలశిల స్వర్ణలత, రావి రత్నగిరి, మోర్ల శివ, మద్దూరి కాంతారావు, బండే నాగ వెంకట కనకదుర్గ, పండ్రాజు లంకమ్మ ప్రసాద్‌, మేడికొండ విజయ్‌, దివి యుగంధరి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సోషల్‌ మీడియాలో చొరవ చూపుతున్న కార్యకర్తలను బుద్ధప్రసాద్‌ సత్కరించారు. చంద్రబాబు నాయుడికే ఎందుకు ఓటు వేయాలి అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు.

వైసీపీ నాయకులకు దోచుకోవడంపైనే శ్రద్ధ : కుమార్‌రాజా

కపిళేశ్వరపురం (పమిడిముక్కల) : వైసీపీ నాయకులు దోచుకుని దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ అభివృదిపై లే దని నియోజకవర్గ టీడీపీ ఇన్‌ చార్జ్‌ వర్ల కుమార్‌రాజ ఆరోపించారు. నియోజకవర్గంలో 15వ రోజు పల్లెబాటలో భా గంగా సోమవారం కపిళేశ్వరపురంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. టీ డీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టిస్తానని హామీ ఇచ్చారు. మండల పార్టీ అధ్యక్షుడు రాజులపాటి శ్రీనివాసరావు, జక్కాశ్రీనివాసరావు, లింగమనేని బాబూరావు, కొల్లిపర బాబి, మాజీ ఎంపీటీ సీ సభ్యుడు సీహెచ్‌ రమేశ్‌, రాజులపాటి శ్రీనివాస్‌, కంచర్ల సురేశ్‌, జనసే నాయకులు పాల్గొన్నారు. గ్రామంలో వైసీపీ నుంచి పది కుంటుంబాలు టీడీపీలో చేరాయి. కండువా కప్పి వర్ల కుమార్‌ రాజా స్వాగతం పలికారు.

కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ ఎమ్మెల్యే కొడాలి విఫలం

గుడివాడ: ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించడంలో ఎమ్మెల్యే కొడాలి నాని విఫలమయ్యాడని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ వెనిగండ్ల రాము దుయ్యబట్టారు. సోమవారం గుడివాడలోని 4, 25 వార్డుల్లో బాబు ష్యూరిటీ - భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్‌చార్జ్‌ బూరగడ్డ శ్రీకాంత్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావులతో కలిసి ఆయా వార్డుల్లో పర్యటించారు. వెనిగండ్ల మాట్లాడుతూ, రోడ్ల అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మురుగు కాల్వల పరిస్ధిఽతి ఘో రంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేన ఇన్‌చార్జ్‌ బూరగడ్డ శ్రీకాంత్‌ మా ట్లాడుతూ ఎన్నికల వేళ వైసీపీలో గుడివాడ అభ్యర్థి ఎవరో అయోమయస్థితి నెలకొందని విమర్శించారు. నలుగురు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను అందజేశారు. చింతల కాల్వ డ్రె యిన్‌ డ్రైన్‌ దుస్ధితిపై వెనిగండ్ల సెల్ఫీ చాలెంజ్‌ విసిరారు. కాకరాల సురేష్‌, సాంబశివరావు, వసంతవాడ దుర్గారావు, లింగం ప్రసాద్‌, యార్లగడ్డ సుధారాణి, మేరుగు మోజెస్‌, శొంఠి రామకృష్ణ, సయ్యద్‌ జబీన్‌, సూరిబాబు, కోడూరి ప్రభు, పొట్లూరి రమాదేవి, కంచనపల్లి సుబ్రహ్మణ్యం, గడ్డం ప్రకా్‌షదాసు, అందుగుల ఏసుపాదం, బాలసాని భవానిశంకర్‌, కొడాలి బాలు, రెడ్డి రాజు, కొడాలి వేణుగోపాలస్వామి, మజ్జి శ్రీనివాసరావు, ఇం టూరి గజేంద్ర, గునుకుల వినోద్‌కుమార్‌, నిల్లా సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:38 AM