Share News

మువ్వల సవ్వడి..మురిసె కూచిపూడి

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:57 AM

కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్స్‌ సొసైటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య స్వర్ణోత్సవాలు ఆదివారంతో ముగిశాయి.

మువ్వల సవ్వడి..మురిసె కూచిపూడి
కూచిపూడిలో నాట్యాంశాలు ప్రదర్శిస్తున్న నృత్యకారిణులు

ముగిసిన కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు..ఒకే వేదికపై 2 వేల మంది ప్రదర్శన

కూచిపూడి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కూచిపూడి హెరిటేజ్‌ ఆర్ట్స్‌ సొసైటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మూడు రోజులుగా నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య స్వర్ణోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఒకే వేదికపై 2 వేల మంది కళాకారులు ప్రదర్శించిన నాట్యాంశాలు మయూరాలు పురివిప్పి నాట్యమాడిన అనుభూతిని కలిగించాయి. మువ్వల సవ్వడికి..కూచిపూడి గ్రామం మురిసి, పుల కించిపోయింది. వందే వందే వాణి భవానీ, రాజగోపాలం..రాధాలోలం అంశాలను 2 వేల మంది కళాకారులు ముందుగా ప్రదర్శించారు. అనంతరం వేదవల్లి ప్రసాద్‌ బృందం ఆధ్యాత్మిక రామాయణ కీర్తన, కృష్ణజనన శబద్దం, బుడి బుడి నడకల అంశాన్ని ప్రదర్శించి ఆద్యంతమూ భక్తిభావం లో ముంచెత్తారు. కనకదుర్గ బృందం థిల్లానా అంశాన్ని ప్రదర్శించి మెప్పించారు. అన్నమయ్య మ్యూజికల్‌ అం డ్‌ డ్యాన్స్‌ కళాశాల బృందం బ్రహ్మాంజలి, దశవతారం అంశాలు ప్రదర్శించి ఔరా అనిపించారు. కరణం శ్రీనివాస్‌ బృందం వినాయక స్తుతి, వసంత స్వరజతి అం శాలు ప్రదర్శించగా, చివరిగా సరితా నెహ్రూ బృందం కథన కుతూహల థిల్లానా, పంచాక్షరీ అంశాల్లో చూపి న హవభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాకారులను, అతిథులను ఉత్సవ కమిటీ కన్వీనర్‌ వేదాంతం వెంకటా చలపతి జ్ఞాపికలు అందించి సత్కరించారు.

Updated Date - Dec 30 , 2024 | 12:57 AM