మునిసిపల్ చెత్త వ్యాను డ్రైవర్ల సమ్మె విరమణ
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:28 AM
గత నెల 20 నుంచి సమ్మె చేస్తున్న మునిసిపల్ చెత్త వ్యాను డ్రైవర్లు తాడిగడప మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు హామీతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

పెనమలూరు, జూన్ 6: గత నెల 20 నుంచి సమ్మె చేస్తున్న మునిసిపల్ చెత్త వ్యాను డ్రైవర్లు తాడిగడప మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు హామీతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ తాడిగడప మునిసిపా లిటీ అఽధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు ఆధ్వర్యంలో కమిషనర్‌తో సీఐ టీయూ నాయకులు ఉప్పాడ త్రిమూర్తులు, మస్తాన్‌వలి, సరళ, వ్యాను డ్రైవర్లు చర్చలు జరిపాక వ్యాను డ్రైవర్లు సమ్మె విరమించారు. వ్యాను డ్రైవర్ల జీతా లు ప్రతినెలా పదో తేదీకల్లా ఇస్తామని, కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్ప డిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిని తొలిగించి డ్రైవర్లను నేరుగా మునిసిపాలిటీ లోకి తీసుకుంటామని ఇచ్చిన హామీల మేరకు డ్రైవర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రెండు వారాలుగా పేరుకుపోయిన చెత్తతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగనున్నాయి.