Share News

మునిసిపల్‌ డ్రైవర్ల వినూత్న నిరసన

ABN , Publish Date - May 30 , 2024 | 12:12 AM

తాడిగడప మునిసిపాలిటీ చెత్త వ్యాను డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో బహిరంగంగా మెడలో ఉరితాడు వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడు తూ, రెండు నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని, తమ సమస్యలు పరిష్కరిస్తామన్న కాంట్రాక్టరు మొండితనంగా వ్యవహరిస్తున్నాడని వాపోయారు.

 మునిసిపల్‌ డ్రైవర్ల వినూత్న నిరసన
మెడలో ఉరితాడు వేసుకొని నిరసన తెలుపుతున్న డ్రైవర్లు

పెనమలూరు, మే 29 : తాడిగడప మునిసిపాలిటీ చెత్త వ్యాను డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో బహిరంగంగా మెడలో ఉరితాడు వేసుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడు తూ, రెండు నెలల నుంచి తమకు జీతాలు ఇవ్వడం లేదని, తమ సమస్యలు పరిష్కరిస్తామన్న కాంట్రాక్టరు మొండితనంగా వ్యవహరిస్తున్నాడని వాపోయారు. నెలకు కేవలం రూ. 13వేలు జీతమిచ్చి వ్యాన్ల రిపేరు ఖర్చులు తమపై రుద్దుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తులు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టరుతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో కార్మికులందరూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతారని, ప్రజా సంఘాలు వారి ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నిరసన కార్యక్రమంలో నరసింహరావు, సాయి కార్తీక్‌, నాగరాజు, సుధాకర్‌, దుర్గారావు, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్రాక్టర్లతో చెత్త తొలగిస్తున్నాం

ఫ కమిషనర్‌ వెంకటేశ్వరరావు

తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని తాడిగడప, కానూరు, పోరంకి, యనమలకుదురు సర్కిళ్లలో గత వారం రోజులుగా వ్యాను డ్రైవర్ల సమ్మె కారణంగా చెత్త తొలిగింపులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే ఇంటింటికీ వెళ్లి ట్రాక్టర్ల సాయంతో చెత్తను సేకరిస్తూ సమస్యను సాధ్యమయినంత మేర తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా సహకరించాలసిందిగా మునిసిపల్‌ కమిషనర్‌ కోరారు.

Updated Date - May 30 , 2024 | 12:12 AM