Share News

ఇంకనూ పక్షపాతమే!

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:13 AM

అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తే అన్ని అనుమతలూ ఇచ్చేస్తారు. అవసరమైతే సెక్యూరిటీ కల్పిస్తారు. కానీ.. ప్రతిపక్ష నేతలు ప్రచారం చేయాలంటే సవాలక్ష నిబంధలు చెబుతారు. అడ్డమైన ఆంక్షలు పెడతారు. అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు విద్యాసంస్థల బస్సులు వాడినా అడ్డుచెప్పరు. కానీ.. ప్రతిపక్ష నేతలకు పరిమితులున్నాయంటారు. నామినేషన్‌ దాఖలుకు వైసీపీ నేతల వెంట ఎంత మంది వచ్చినా కాదనరు. కానీ ప్రతిపక్ష నేతల వెంట నలుగురుకు మించి వస్తే ఆపేస్తారు. ఇదీ మన పోలీసుల తీరు. దీన్ని పక్షపాతం కాక మరేమంటారు? ఇది ఏపక్షం కాక మరేమవుతుంది? ఇలా వ్యవహరించినందుకు విజయవాడ సీపీపై వేటు ఈసీ వేటు వేసింది. అయినా పోలీసులు పక్షపాతంగానే వ్యవహరిస్తుండటం గమనార్హం.

ఇంకనూ పక్షపాతమే!

సీపీపై వేటు పడినా మారని పోలీసులు

వైసీపీకి జీహుజూర్‌ అంటున్న పోలీసులు

విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి సేవలో పోలీసులు

రిటర్నింగ్‌ కార్యాలయంలోకి అభ్యర్థితోపాటు 16 మందికి అనుమతి

గద్దె నామినేషన్‌కు నలుగురినే అనుమతి

మైలవరంలో టీడీపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌ కుమారుడిని అనుమతించని పోలీసులు

అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తే అన్ని అనుమతలూ ఇచ్చేస్తారు. అవసరమైతే సెక్యూరిటీ కల్పిస్తారు.

కానీ.. ప్రతిపక్ష నేతలు ప్రచారం చేయాలంటే సవాలక్ష నిబంధలు చెబుతారు. అడ్డమైన ఆంక్షలు పెడతారు.

అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు విద్యాసంస్థల బస్సులు వాడినా అడ్డుచెప్పరు.

కానీ.. ప్రతిపక్ష నేతలకు పరిమితులున్నాయంటారు.

నామినేషన్‌ దాఖలుకు వైసీపీ నేతల వెంట ఎంత మంది వచ్చినా కాదనరు.

కానీ ప్రతిపక్ష నేతల వెంట నలుగురుకు మించి వస్తే ఆపేస్తారు.

ఇదీ మన పోలీసుల తీరు. దీన్ని పక్షపాతం కాక మరేమంటారు? ఇది ఏపక్షం కాక మరేమవుతుంది? ఇలా వ్యవహరించినందుకు విజయవాడ సీపీపై వేటు ఈసీ వేటు వేసింది. అయినా పోలీసులు పక్షపాతంగానే వ్యవహరిస్తుండటం గమనార్హం.

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ జిల్లాలో కొందరు పోలీసు అధికారులు వైసీపీ సేవలో తరిస్తున్నారు. వైసీపీకి కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలపై సీపీ కాంతిరాణాపై వేటు పడినా కొందరు పోలీసులు మాత్రం వైసీపీ నాయకుల పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం నుంచే కాకుండా విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాల నుంచీ పెద్దఎత్తున జనసమీకరణ చేశారు. కార్యక్రమానికి వచ్చిన పురుషులకు క్వార్టర్‌ బాటిల్‌, రూ.300 ఇవ్వగా మహిళలకు రూ.500 చొప్పున అందజేశారు. శారదా కాలేజీ, కేఎల్‌ యూనివర్సిటీకి చెందిన బస్సుల్లో జనాలను తరలించారు. నిబంధనల ప్రకారం పాఠశాలల, కళాశాలల బస్సులను రాజకీయ నాయకుల కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. కానీ యథేచ్ఛగా వాటిని జనాలను తరలించడానికి ఉపయోగించారు. పడవల రేవు వంతెన నుంచి మొదలైన నామినేషన్‌ ర్యాలీ రామలింగేశ్వర కట్ట మీదుగా బందరు రోడ్డులోని రిటర్నింగ్‌ అధికారి అయిన సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుంది. అవినాశ్‌ ర్యాలీ కారణంగా దారిపొడవునా ట్రాఫిక్‌ 2 గంటలపాటు ఆగిపోయింది. దీంతో మండుటెండలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఇది ఏకపక్షం కదా..?

నామినేషన్‌ సందర్భంగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అభ్యర్థితోపాటు కేవలం నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించాలన్నది నిబంధన. కానీ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌తోపాటు 16 మంది లోపలికి వెళ్లిపోయారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న విజయవాడ సౌత్‌ జోన్‌ ఏసీపీ రత్నరాజు, కృష్ణలంక పోలీసుస్టేషన్‌ సిబ్బంది కానీ ఎవ్వరూ వీరికి అభ్యంతరం తెలపలేదు. కానీ సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ విషయంలో మాత్రం పోలీసులు నిబంధనలు తూచ తప్పకుండా పాటించారు. గద్దె రామ్మోహన్‌తోపాటు కేవలం నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించారు. మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్‌ కుమారుడు ధీమంత్‌ సాయిని సైతం బయటే నిలబెట్టేశారు. కేవలం నలుగురినే అనుమతిస్తామంటూ కృష్ణ ప్రసాద్‌ కుమారుడిని లోపలికి అనుమతించలేదు.

Updated Date - Apr 25 , 2024 | 01:13 AM