మొరాయిస్తున్న సర్వర్లు!
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:23 AM
పేదలకు పంపిణీ చేసిన ఇళ్లపట్టాలు రిజిస్ర్టేషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి సర్వర్ పనిచేయక పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది పడిగాపులు పడుతున్నారు. పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను హక్కు భక్తుం చేసే ఉద్దేశంతో ఉచితంగా రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మూడు రోజుల కిందట బాపులపాడు మండలంలో చేపట్టినరిజిస్రేషన్ ప్రక్రియ సర్వర్ సక్రమంగా స్పందించకపోవడంతో మందకొ డిగా సాగుతోంది.
హనుమాన్‌జంక్షన్, ఫిబ్రవరి 5 : పేదలకు పంపిణీ చేసిన ఇళ్లపట్టాలు రిజిస్ర్టేషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి సర్వర్ పనిచేయక పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది పడిగాపులు పడుతున్నారు. పేదలకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను హక్కు భక్తుం చేసే ఉద్దేశంతో ఉచితంగా రిజిస్ర్టేషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మూడు రోజుల కిందట బాపులపాడు మండలంలో చేపట్టినరిజిస్రేషన్ ప్రక్రియ సర్వర్ సక్రమంగా స్పందించకపోవడంతో మందకొ డిగా సాగుతోంది. మండలంలో 3,464 మందికి ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు షుమారు వెయ్యిలోపు మాత్రమే రిజిస్ర్టేషన్లు మొదటి ప్రక్రియ సచివాలయం స్థాయిలో పూర్తి చేశారు. రిజిస్ర్టేషన్ మొదటి ప్రక్రియలోనే సర్వర్ సమస్యతో రెవెన్యూ, సచివాలయం సిబ్బంది గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. వారితో పాటు లబ్ధిదారులు కూడా సచివాలయాలు వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. దీంతో పాటు కొంత మంది లబ్ధిదారుల పేర్లు రిజిస్ర్టేషన్ పోర్టల్‌లో కనిపించకపోవడంతో వెనుతిరిగి వెళ్లాల్సివస్తోంది. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల పేర్లును ఎంట్రీ చేసిన కొంత మంది పేర్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పట్టాలు రిజిస్ర్టేషన్లు చేస్తున్నట్లు గ్రామాల్లో ప్రచారం చేయడంతో ఎంతో ఆశతో వెళ్లిన లబ్ధిదారులు సర్వర్ సమస్యతో ఇబ్బందికి గురవుతున్నారు. లబ్ధిదారులైనమహిళ అన్ని పనులు మానుకొని సచివాలయాలు వద్ద పడిగాపులు పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.