Share News

రాష్ట్రంలోనే మోడల్‌గా గన్నవరం

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:08 AM

రాష్ట్రంలోనే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతా నని, ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. గన్నవరానికి ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలతోపాటు పలు పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ యువ తకు ఉద్యోగవకాశాలను కల్పిస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలా లను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు.

 రాష్ట్రంలోనే మోడల్‌గా గన్నవరం
విజయ సంకేతం చూపుతున్న యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం, ఏప్రిల్‌ 24 : రాష్ట్రంలోనే గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతా నని, ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. గన్నవరానికి ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలతోపాటు పలు పరిశ్రమలను తీసుకువచ్చి నిరుద్యోగ యువ తకు ఉద్యోగవకాశాలను కల్పిస్తానన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నుంచి తొమ్మిది నెలల్లోనే నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలా లను పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం నామినేషన్‌ వేసిన అనంతరం విలేకరులతో మా ట్లాడుతూ, గన్నవరం తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గమని, ఇక్కడ నుంచి ఒక్కసారి కాం గ్రెస్‌ అభ్యర్థి, రెండుసార్లు స్వతంత్రులు గెలు పొందా రని, మిగిలిన ఆరు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో మే 13న జరగనున్న ఎన్నికల్లో టీడీపీ మరోసారి విజయపతాకాన్ని ఎగురవేయనున్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (కేడీసీసీబీ) చైర్మన్‌గా బ్యాంక్‌కు జాతీయస్థాయిలో ఉత్తమంగా నిలిపినట్లు తెలిపారు. బ్రహ్మయ్యలింగం చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి సుమారు 12 వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు, గన్నవరానికి తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో సహజ వనరులకు కొదవలేదని, వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసి గన్నవరాన్ని రాష్ట్రంలోనే మేటిగా అభివృద్ధి చేస్తానని తెలిపారు.

తిరుపతమ్మ ఆలయంలో పూజలు

యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్‌ అనంతరం పాత గన్నవరంలోని తిరుపతమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్య క్షుడు జాస్తి శ్రీధర్‌ యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరీ దంపతులకు అమ్మవారి శేషవస్ర్తాలను అందజేశారు. యార్లగడ్డ ఘన విజయం సాధించాలని పూజలు చేశారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ పొట్లూరి బసవరావు, మాజీ సర్పంచ్‌ గూడపాటి తులసీమోహన్‌, పాలడు గు నాని, జాస్తి ఫణిశేఖర్‌, యనమదల అజయ్‌, పీవిఎస్‌ఆర్‌ కృష్ణా, జాస్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఫ గన్నవరంలో యార్లగడ్డ నామినేషన్‌ సంద ర్భంగా టీడీపీ సీనియర్‌ నేత ఆళ్ల గోపాలకృష్ణ అభ యాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి, స్వామి వారి చిత్రపటాన్ని, ఆశీస్సులు అందజేశారు. ఆయన వెంట టీడీపీ నేతలు చిరుమామిళ్ల సూర్యం, వేములపల్లి శ్రీనివాసరావు, మూల్పూరి సాయికళ్యాణి, బీజేపీ నాయకులు తుమ్మల అంజిబాబు పాల్గొన్నారు.

భారీగా తరలిన శ్రేణులు

హనుమాన్‌జంక్షన్‌ / రూరల్‌ : యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్‌ కార్యక్రమానికి బాపులపాడు మండలం నుంచి భారీగా ప్రజానీకం తరలివెళ్లి మద్దతు తెలియజేశారు. మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, కార్యదర్శి పుట్టా సురేష్‌ ఆధ్వర్యంలో రెండు వేల ద్విచక్ర వాహనాలు, 4వేల ఆటోల్లో దాదాపు 12వేల మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. చిరుమామిళ్ల సూర్యం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు, మండల అధ్యక్షుడు వడ్డి శివనాగేశ్వరరావు, జంక్షన్‌ పట్టణ అధ్యక్షుడు అహ్మద్‌ తరలి వెళ్లారు. రంగన్నగూడెం నుంచి బయలుదేరిన బైక్‌ ర్యాలీని ఆళ్ల గోపాలకృష్ణ, మొవ్వా వేణుగోపాల్‌, బెజవాడ కృష్ణారావు, దోనవల్లి నాగసరోజినిలతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పుసులూరి పూర్ణవెం కట ప్రసాద్‌, పల్లగాని వీరాంజనేయులు, యెనిగళ్ల జ్ఞానశేఖర్‌ తదితరులు బైక్‌ ర్యాలీతో వెళ్లారు. రేమల్లె నుంచి యనమదల శ్రీనివాసరావు, విజయానంద్‌, యనమదల సుధాకర్‌, తుమ్మల ఉదయ్‌, కలపాల కుమార్‌, కలపాల రాధాకృష్ణ, తెలుగు యువత అధ్య క్షుడు కలపాల పింకు యువత బైక్‌ ర్యాలీతో నామి నేషన్‌ కార్యక్రమాని తరలివెళ్లారు. ఆరుగొలను నుంచి బేతా శేషుకుమార్‌, తుమ్మల బ్రహ్మాజీ, కాకులపాడు నుంచి చలసాని శ్రీనివాస్‌, తాడంకి స్వామిదాసు, పెరికీడు, వీరవల్లి, కోడూరుపాడు, మల్లవల్లి, కొత్తపల్లి, వేలేరు నుంచి బైక్‌ ర్యాలీతో భారీగా తరలివెళ్లారు.

Updated Date - Apr 25 , 2024 | 01:08 AM