Share News

అర్ధరాత్రి.. మళ్లీ తవ్వకాలు

ABN , Publish Date - May 21 , 2024 | 01:26 AM

ఎన్నికల ఫలితాలు రావటానికి మరో పక్షం రోజులు ఉంది. అధికారంలోకి వచ్చేది అనుమానంగానే ఉంది. దొరికిన ఈ కొద్ది సమయాన్ని కూడా ఎందుకు వదులుకోవటం అని అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్‌పై తెగబడ్డారు. గన ్నవరం మండలంలోని కొండపావులూరులో ఆగిపోయిన అక్రమ మైనింగ్‌ మళ్లీ మొదలుపెట్టారు. నిశిరాత్రిలో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. వందల సంఖ్యలో లారీలు మట్టిని తరలించేస్తున్నారు. వారం రోజులుగా కొండపావులూరు ఇదే జరుగుతోంది. స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు కిమ్మనటం లేదు.

అర్ధరాత్రి.. మళ్లీ తవ్వకాలు

కొండపావులూరులో జూలు విదిల్చిన వైసీపీ మైనింగ్‌ మాఫియా

సర్వే నెంబర్‌ 6, 34లలో అర్ధరాత్రి వేళ అక్రమ తవ్వకాలు

సమీప మామిడి తోటల్లో ఎక్స్‌కవేటర్లు దాచి తవ్వకాలు

అధికారం ఉంటుందో లేదో తెలియక చకచకా పనులు

ఫిర్యాదులను పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు

ఎన్నికల ఫలితాలు రావటానికి మరో పక్షం రోజులు ఉంది. అధికారంలోకి వచ్చేది అనుమానంగానే ఉంది. దొరికిన ఈ కొద్ది సమయాన్ని కూడా ఎందుకు వదులుకోవటం అని అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్‌పై తెగబడ్డారు. గన ్నవరం మండలంలోని కొండపావులూరులో ఆగిపోయిన అక్రమ మైనింగ్‌ మళ్లీ మొదలుపెట్టారు. నిశిరాత్రిలో అక్రమ తవ్వకాలకు తెరలేపారు. వందల సంఖ్యలో లారీలు మట్టిని తరలించేస్తున్నారు. వారం రోజులుగా కొండపావులూరు ఇదే జరుగుతోంది. స్థానికులు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు కిమ్మనటం లేదు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం) : కొండపావులూరులో అక్రమ మైనింగ్‌ మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్టుగా సాగిపోతోంది. కొండపావులూరులోని సర్వే నెంబర్‌ 6, సర్వే నెంబర్‌ 34లలో యథేచ్చగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. సర్వే నెంబర్‌ 34లో పూర్తిగా అసైన్డ్‌ పట్టాభూములు ఉన్నాయి. పూర్వం రోజుల్లో దళితులకు సాగు చేసుకునేందుకు ఇచ్చారు. ఆ తర్వాత క్రమంలో ఈ పట్టాలు చేతులు మారాయి. ఈ భూముల్లో గ్రావెల్‌, ఎర్రమట్టి నిల్వలు ఉండటంతో అక్రమార్కులు వీటిని మట్టి తవ్వుకునేందుకు కొనుగోలు చేశారు. గతంలో ఒకసారి మట్టి తవ్వకాలకు ఈ భూములను కొనుగోలు చేసి 30 అడుగుల మేర లోతున తవ్వేశారు. ఇటీవల కాలంలో ఇవే భూములను మట్టి కోసం మళ్లీ రెండోసారి కొనుగోలు చేశారు. ఎన్నికల ముందు ఓ 20 అడుగుల మేర అదనంగా అంటే మొత్తంగా 50 అడుగుల మేర తవ్వేశారు. అప్పట్లో ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీయటంతో.. క్వారీని నిలుపుదల చేశారు. అక్రమ తవ్వకాలు ఆగిపోయాయి.

అడుగుల లోతున మళ్లీ తవ్వకాలు

మళ్లీ ఇక్కడ అక్రమ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఈసారి పగటి సమయంలో కాకుండా అర్ధరాత్రి సమయాన్ని తవ్వకాలకు ఎంచుకున్నారు. గత వారం రోజులుగా మరో 5 అడుగుల లోతున అదనంగా మట్టిని, తెల్లచట్టు గ్రావెల్‌ను తవ్వేశారు. ఇంకా తవ్వేస్తున్నారు. కొండపావులూరులోనే సర్వే నెంబర్‌ 6 కొండను కూడా అక్రమార్కులు తవ్వేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌ఐడీఎం వంటి కేంద్ర సంస్థలు ఉన్నాయి. వీటికి దగ్గర్లోనే సర్వే నెంబర్‌ 6 ఉంది. సర్వే నెంబర్‌ 6లో భారీగా తవ్వేస్తున్నారు. సమీప మామిడి తోటల్లో పగటి సమయంలో ప్రొక్లెయిన్లు దాస్తున్నారు. రాత్రి సమయంలో విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. భారీగా గ్రావెల్‌ను తరలించేస్తున్నారు. వీటికి సమీపంలో జగనన్న కాలనీ ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. స్థానికంగా ప్రశ్నించే వారికి ఇళ్ల బేస్‌మెంట్లలో గ్రావెల్‌ను నింపటానికి తవ్వకాలు జరుగుతున్నాయన్న ప్రచారాన్ని తీసుకు వస్తున్నారు. వాస్తవంగా మాత్రం ఈ గ్రావెల్‌ను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. సర్వే నెంబర్‌ 6లో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై కూడా ఇప్పటికే ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదులపై రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు.

Updated Date - May 21 , 2024 | 01:26 AM