Share News

సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వ కేంద్రాలు

ABN , Publish Date - May 15 , 2024 | 12:47 AM

కోర్టులో వున్న వివాదాలు సత్వరమే పరిష్కరించ టానికి మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేశామని, దీనివల్ల కక్షిదారులు వారి సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవచ్చని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి, మండల లీగల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ ఎ.సత్యానంద్‌ తెలిపారు.

సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వ కేంద్రాలు
చట్ట వివరణ చేస్తున్న మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి ఎ.సత్యానంద్‌

సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వ కేంద్రాలు

మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి, మండల లీగల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ సత్యానంద్‌

విజయవాడ లీగల్‌, మే 14 : కోర్టులో వున్న వివాదాలు సత్వరమే పరిష్కరించ టానికి మధ్యవర్తిత్వ కేంద్రాలు ఏర్పాటు చేశామని, దీనివల్ల కక్షిదారులు వారి సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవచ్చని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి, మండల లీగల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ ఎ.సత్యానంద్‌ తెలిపారు. ఇందుకోసమే సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ సెక్షన్‌ 89 ప్రకారం ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. మాజీ బార్‌ అధ్యక్షుడు, మధ్యవర్తిత్వ కేంద్ర కృష్ణాజిల్లా తొలి సభ్యులు వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సమాధానం దొరుకుతుందని, ఇరుపార్టీలు వారి మిత్రత్వాన్ని పోగొట్టుకోకుండా చూడబడుతుందని తెలిపారు. ఎన్నో కాపురాలు నిలబెట్టే అవకాశం ఈ కేంద్రం ద్వారా తనకు లభించిందని అన్నారు. మీడియేటర్‌ సాక్షిగా పరిగణించబడని వివిధ అంశాలను గుప్తా వివరించారు. మరో సభ్యుడు రాజారత్నం వారి అనుభవాలను తెలియజేశారు. సభకు బార్‌ అధ్యక్షుడు కొత్త చంద్రమౌళి అధ్యక్షత వహించగా సహాయ కార్యదర్శి కలతోటి క్రాంతికుమార్‌ స్వాగతం పలికి వందన సమర్పణ చేశారు.

Updated Date - May 15 , 2024 | 12:47 AM