Share News

ఇంద్రకీలాద్రిపై రద్దీ నియంత్రణకు చర్యలు

ABN , Publish Date - May 31 , 2024 | 01:01 AM

దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు దేవస్థాన ఈవో కేఎస్‌ రామారావు చర్యలు చేపట్టారు. ఇటీవల శుక్ర, శని, ఆదివారాలలో రోజుకు కనీసం 40 నుంచి 50 వేలమంది భక్తులు తరలిరావటం, పరిమిత సంఖ్యలో క్యూల వద్ద సిబ్బందితో నియంత్రణ కష్టతరమైంది.

ఇంద్రకీలాద్రిపై రద్దీ నియంత్రణకు చర్యలు

వన్‌టౌన్‌, మే 30 : దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు దేవస్థాన ఈవో కేఎస్‌ రామారావు చర్యలు చేపట్టారు. ఇటీవల శుక్ర, శని, ఆదివారాలలో రోజుకు కనీసం 40 నుంచి 50 వేలమంది భక్తులు తరలిరావటం, పరిమిత సంఖ్యలో క్యూల వద్ద సిబ్బందితో నియంత్రణ కష్టతరమైంది. ఈ క్రమంలో తాజాగా వాహనాల పార్కింగ్‌కు పలు చర్యలు చేపట్టారు. శుక్ర, శని, ఆదివారాలలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విధులు నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. అంతరాలయం వద్ద, రూ.300, రూ.100 క్యూలైన్లు, టికెట్‌ స్కానింగ్‌ పాయింట్‌ వద్ద, మల్లేశ్వరాలయం వద్ద ఓవరాల్‌ పర్యవేక్షణకు పలువురు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. శుక్ర, శని, ఆదివారాలలో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు, టోల్‌గేట్ల, కనకదుర్గానగర్‌ వద్ద సెక్యూరిటీలకు ప్రత్యేక విధులు కేటాయించాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని ఈ నెల 31వ తేదీ నుంచే ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. రద్దీ నియంత్రణలో విఫలం చెందితే సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి 20 మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నారు.

Updated Date - May 31 , 2024 | 01:01 AM