Share News

రేపు విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు ప్రాజెక్టులు ప్రారంభం

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:03 AM

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ నరేంద్ర ఏ పాటిల్‌ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రేపు విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు ప్రాజెక్టులు ప్రారంభం
రేపు విజయవాడ డివిజన్‌ పరిధిలో పలు ప్రాజెక్టులు ప్రారంభం

రైల్వే స్టేషన్‌, మార్చి 10 : విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు ప్రాజెక్టులకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈనెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ నరేంద్ర ఏ పాటిల్‌ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తణుకు, బిక్కవోలు, ఏలూరుల్లో మూడు అప్‌ గ్రేడెడ్‌ గూడ్సు షెడ్లను, 67 ఓఎ్‌సఓపీ స్టాళ్లు, గూడూరు-బిట్రగుంట, బిట్రగుంట-కరవది-చీరాల మూడో లైన్లను, విజయవాడ బైపా్‌సలైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయం రూ.3,246 కోట్లుగా పేర్కొన్నారు. వీటితో పాటు సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్‌ రైలును ప్రారంభించనున్నట్టు తెలిపారు. విశాఖపట్నం-విజయవాడ-సికింద్రబాద్‌ మధ్య ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తంగా ఉందన్నారు. విజయవాడ రైల్వే డివిజన్‌కు 15 గూడ్స్‌ షెడ్ల అప్‌గ్రేడేషన్‌ కోసం రూ. 150 కోట్లు కేటాయించిందన్నారు. తాడేపల్లి గూడెం, బయ్యారం, బిక్కవోలు, ద్వారపూడి, పడుగుపాడు, సామర్లకోట, కృష్ణాకెనాల్‌, ఏలూరు. గుడివాడ, తెనాలి, నిడదవోలు, పాలకొల్లు, అకివీడు, తణుకులలో గూడ్స్‌ షెడ్లు ఉన్నాయని తెలిపారు. అదనపు డీఆర్‌ఎం ఎం.శ్రీకాంత్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌మేనేజర్‌ వావిలపల్లి రాంబాబు, పీఆర్‌ఓ నుస్రత్‌ ఎం మంద్రుప్కర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 01:03 AM