చైతన్యంతోనే మహిళా సాధికారత
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:44 AM
మహిళలు చైతన్యవంతులై అన్నిరంగాల్లోనూ రాణించాలని జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ అన్నారు. కొల్లు ఫౌండేషన్ అధ్యక్షురాలు కొల్లు నీలిమ అధ్యక్షతన కొల్లు పౌండేషన్ ఆధ్వర్యంలో లలిత కన్వెన్షన్ హాలులో జరిగిన అం తర్జాతీయ మహిళా దినోత్సవంలో గద్దె అనురాధ ము ఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
మచిలీపట్నం టౌన్, మార్చి 7 : మహిళలు చైతన్యవంతులై అన్నిరంగాల్లోనూ రాణించాలని జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ అన్నారు. కొల్లు ఫౌండేషన్ అధ్యక్షురాలు కొల్లు నీలిమ అధ్యక్షతన కొల్లు పౌండేషన్ ఆధ్వర్యంలో లలిత కన్వెన్షన్ హాలులో జరిగిన అం తర్జాతీయ మహిళా దినోత్సవంలో గద్దె అనురాధ ము ఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, కొల్లు నీలిమ ఆధ్వర్యంలో గద్దె అనురాధ, కవితా బ్యాంకు చైర్మన్ కవిత తదితరులను ఘనంగా సత్కరించారు. మహిళలు విద్యావంతులయితేనే దేశాభివృద్ధి జరుగుతుందని ఐఏఎస్ అకాడమీ చైర్మన్ దిట్టకవి వెంకటేశ్వరరావు అన్నారు. పరాసుపేట మానవత స్వచ్ఛంద సేవా సంస్థ బాలికల ఉచిత హాస్టల్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి. అన్నపూర్ణ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ షిప్లా, పద్మావతి బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ కనకదుర్గ, ఎస్‌వి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కె. విజయ మాధవిలను కార్పొరేటర్ రాసంశెట్టి వాణిశ్రీ సత్కరించారు. నోబుల్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎర్నెస్ట్ ఆధ్వర్యంలో ఏడుగురు విద్యార్థులకు ఆర్ధిక సాయం అందించారు. కృష్ణా విశ్వవిద్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుందరకృష్ణ, పద్మావతి మహిళా హిందూ కళాశాల విశ్రాంత బోటనీ విభాగాధిపతి ఏ.వి.సుబ్బలక్ష్మి, డాక్టర్ ఎల్. సుశీల, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమారి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రాంబాబు, రామశేఖరరెడ్డి, అనుపమ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మేయర్ వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు. డాక్టర్ పట్టాభి మెమో రియల్ ట్రస్టు, యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో గుడిపూడి రాఽధికారాణికి నారీశక్తి పురస్కారం అందచేశారు. యూనియన్ బ్యాంకు సీనియర్ మేనేజర్ విజయభారతి, బ్రహ్మకుమారీస్ కవిత తదితరులు పాల్గొన్నారు.