మహాసాద్వి మరియమాత
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:30 AM
స్త్రీలందరిలో ధన్యురాలు, మహాసాద్వి అయిన మరియమాతను గౌరవిస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందని ఎమ్‌ఎస్‌ఎఫ్ ప్రావిన్షియల్ ఫాదర్ బవిరి సురేష్ అన్నారు.
ఆమెను గౌరవిస్తే దేవుడి అనుగ్రహం
ఆరో రోజు నవదిన ప్రార్థనల్లో ఫాదర్ బవిరి సురేష్
గుణదల, ఫిబ్రవరి 5: స్త్రీలందరిలో ధన్యురాలు, మహాసాద్వి అయిన మరియమాతను గౌరవిస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందని ఎమ్‌ఎస్‌ఎఫ్ ప్రావిన్షియల్ ఫాదర్ బవిరి సురేష్ అన్నారు. గుణదలమాత నూరు వసంతాల మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నవదినప్రార్థనలు సోమవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ముఖ్యఅతిథిగా విచ్చేసిన బవిరి సురేష్ భక్తులకు సందేశమిచ్చారు. మరో నాలుగు రోజుల్లో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయని పుణ్యక్షేత్రం రెక్టర్ యేలేటి విలియం జయరాజు తెలిపారు. అంతకముందు దివ్యసత్ప్రసాద వదనంతో గురువులు కొండపైకి చేరుకున్నారు. ఫాదర్ బి.సురేష్, కొలకాని మరియన్న, తోట సునీల్‌రాజు, జాన్‌పీటర్ గురువులు కొండ మధ్య మరియమాత గుహ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దివ్యపూజాబలి సమర్పించారు. జోజినగర్, పెజ్జోనిపేట, గన్నవరం విచారణల నుంచి భక్తులు హాజరయ్యారు.