Share News

మచిలీపట్నానికి మహర్దశ

ABN , Publish Date - Jul 15 , 2024 | 12:55 AM

‘‘మచిలీపట్నానికి మహర్దశ రాబోతోంది. రూ.58 కోట్లతో అమృత పథకం కింద డ్రెయిన్లు, అభివృద్ధి పనులు చేస్తాం. రూ.70 వేల కోట్లతో బీపీసీఎల్‌ ఆయిల్‌ రిఫైనరీ రాబోతోంది. బందరును ఉపాధి అవకాశాల నగరంగా తీర్చిది ద్దుతాం.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

మచిలీపట్నానికి మహర్దశ
ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

రూ.70 వేల కోట్లతో బీపీసీఎల్‌ ఆయిల్‌ రిఫైనరీ రాక

రూ.58 కోట్లతో డ్రెయిన్లు, అభివృద్ధి పనులు: కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, జూలై 14: ‘‘మచిలీపట్నానికి మహర్దశ రాబోతోంది. రూ.58 కోట్లతో అమృత పథకం కింద డ్రెయిన్లు, అభివృద్ధి పనులు చేస్తాం. రూ.70 వేల కోట్లతో బీపీసీఎల్‌ ఆయిల్‌ రిఫైనరీ రాబోతోంది. బందరును ఉపాధి అవకాశాల నగరంగా తీర్చిది ద్దుతాం.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం టీడీపీ మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన ప్రజాదర్బర్‌ నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టీటీడీ కల్యాణ మండపానికి మరమ్మతులు చేయించాలని పీవీ ఫణికుమార్‌ తదితరులు వినతిపత్రమిచ్చారు. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘ నాయకుడు తమ్ము నాగరాజు, బి.వి.మల్లికార్జున రావు వినతిపత్రమిచ్చారు. పెన్షన్లు, ఇళ్ల స్థలాలు కావాలంటూ ప్రజలు దరఖాస్తులి చ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 16,500 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించామన్నారు. ఆస్పత్రిలో పసికందును అపహరించిన కేసులో నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ, గొర్రెపాటి గోపీచంద్‌, గోపు సత్యనారాయణ, ఇలియాస్‌పాషా పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2024 | 12:55 AM