Share News

అక్షరారోగ్యం..

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:39 AM

‘మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని జాగ్రత్త పడండి’ అంటూ ఆరోగ్య విజ్ఞాన రచనలు అప్రమత్తం చేస్తున్నాయి. పుస్తక మహోత్సవంలో ఈసారి ఆరోగ్య రచనలతో పుస్తకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఉరుకులు పరుగుల జీవితంలో అనేక రుగ్మతలు మనుషుల్ని వెంటాడుతున్నాయి.

అక్షరారోగ్యం..

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

‘మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని జాగ్రత్త పడండి’ అంటూ ఆరోగ్య విజ్ఞాన రచనలు అప్రమత్తం చేస్తున్నాయి. పుస్తక మహోత్సవంలో ఈసారి ఆరోగ్య రచనలతో పుస్తకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఉరుకులు పరుగుల జీవితంలో అనేక రుగ్మతలు మనుషుల్ని వెంటాడుతున్నాయి. చిన్న సమస్యే కదా అని తేలిగ్గా తీసుకుంటే.. భవిష్యత్తులో అవి ప్రాణాంతకంగా మారుతున్నాయి. హైబీపీ, షుగర్‌, ఊబకాయం, గుండెజబ్బులు, కేన్సర్‌ వంటివి అంత తొందరగా బయట పడవు. ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులను సరైన సమయంలో గుర్తించగలిగితే వాటి నుంచి బయట పడవచ్చు. నిపుణులైన వైద్యులు అక్షర రూపంలోకి మరల్చిన కొన్ని రచనలు ఈసారి పుస్తక మహోత్సవంలో కొలువుదీరాయి. వీటిలో ‘ఆరోగ్య విజ్ఞాన ప్రచురణలు’ ఒకటి. ఒకటో నెంబర్‌ స్టాల్‌లో సులభంగా అర్ధం చేసుకోగలిగే పుస్తకాలు ఉన్నాయి. ఈ రచనలు వాడుక భాష తెలుగులో తీసుకువచ్చారు. ‘పంచదార, ఆహారం మంచి-చెడు, ఉప్పు ముప్పే కాదు, కేన్సర్‌ కోడ్‌, మధుమేహం, ఊబకాయం, ఆహారం-ఆరోగ్యం, ఒకప్పుడు డయాబెటిస్‌ ఉండేది’ వంటి పుస్తకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితో పాటు బరువు తగ్గేందుకు సులువైన మార్గాలు, పిండి పదార్థాలు-హానికరం, మందులు లేకుండా మధుమేహం నుంచి బయటపడే మార్గం. ఇన్సులిన్‌ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా పుస్తకాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఉపవాసం పుస్తకం ఆకట్టుకుంటోంది. అంతర్జాతీయ ప్రముఖ వైద్యులు జాసన్‌ ఫండ్‌, గ్యారీటాబ్స్‌ తమ రచనలకు పుస్తకరూపం ఇచ్చారు.

Updated Date - Jan 05 , 2024 | 12:41 AM