Share News

సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:51 AM

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసే సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళల జీవితాలు వెలుగుమయం కానున్నాయని కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి అన్నారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు
ఎనికేపాడులో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న యార్లగడ్డ జ్ఞానేశ్వరి

యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి

గుణదల, మార్చి 21: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసే సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళల జీవితాలు వెలుగుమయం కానున్నాయని కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి అన్నారు. ఆమె గురువారం ఎనికేపాడులో ఇంటింటికీ వెళ్లి కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేసే సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మహిళలపై దాడులకు పాల్పడే వారికి గన్న వరంలో స్థానమే లేదని అన్నారు. కోనేరు శివరామకృష్ణ(పెదబాబు), కోనేరు వెంకటనారాయణ, కోనేరు సందీప్‌, చాగంటిపాటి వెంకటకృష్ణ, వేలంకి శరత్‌ కుమార్‌, గోగం బాలకోటేశ్వరరావు, పొదిలి లలిత, అనుమోలు విజయ, వరికూటి కోటేశ్వరరావు, మువ్వా విజయలక్ష్మి, బీజేపీ విజయవాడ రూరల్‌ మండల అధ్య క్షుడు కురుమద్దాలి ఫణికుమార్‌, జనసేన నేత పొదిలి దుర్గారావు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:51 AM