రెండు పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని రూపుమాపుదాం
ABN , Publish Date - Mar 03 , 2024 | 12:57 AM
రెండు పోలియో చుక్కలతో చిన్నారుల్లో అంగ వైకల్యాన్ని రూపుమాపుదామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు పిలుపునిచ్చారు.
నేడు ఎన్టీఆర్ జిల్లాలో 2.48 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు
3.11 లక్షల డోసులు సిద్ధం: కలెక్టర్ ఎస్.దిల్లీరావు
వన్‌టౌన్, మార్చి 2: రెండు పోలియో చుక్కలతో చిన్నారుల్లో అంగ వైకల్యాన్ని రూపుమాపుదామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.దిల్లీరావు పిలుపునిచ్చారు. ఈనెల 3, 4, 5 తేదీల్లో పల్స్ పోలియో సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం పాత ప్రభుత్వాసుపత్రి వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభిం చారు. ఆదివారం జిల్లాలో 1,008 పల్స్ పోలియో కేంద్రాల్లో ఐదేళ్లలోపున్న 2.48 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నామని ఆయన తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 397, గ్రామీణ ప్రాంతాల్లో 611 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో 35 కేంద్రాలు, 71 మొబైల్ యూనిట్లు ఉన్నాయన్నారు. 4,244 మంది వ్యాక్సినేటర్లు, 3,11, 460 చుక్కల డోస్‌లను సిద్ధం చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు. పల్స్ పోలియో చుక్కలు వేయడం ద్వారా ఐదేళ్లలో ఎక్కడా పోలియో కేసులు నమోదు కాలేదని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. ఆదివారం ఎంపిక చేసిన కేంద్రాల్లో పోలియో చుక్కలు వేస్తారని సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి చుక్కలు వేస్తారని మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నగరంలో 1.50లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. విమ్స్ నర్సింగ్ విద్యార్థులు, పోలియోతో బాలిక పడే ఇబ్బందులను వీధినాటిక ద్వారా ప్రదర్శించారు. రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బి.సమరం, వైద్యారోగ్యశాఖ జిల్లా అధికారిణి సుహా సిని, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేష్, జిల్లా ఇమ్యూనై జేషన్ అధికారి డాక్టర్ అమృత, టీబీ కంట్రోల్ అధికారిణి డాక్టర్ ఉషా రాణి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఇందుమతి, జిల్లా మలేరియా అధికారి మోతీబాబు, డీపీఎంవో డాక్టర్ నవీన్, అప్నా అధ్యక్షుడు డాక్టర్ అనమయ్య, ఐడీసీసీ ప్రాజెక్ట్ అధికారిణి జి.ఉమాదేవి పాల్గొన్నారు.
కృష్ణాజిల్లాలో 1.39 లక్షల చిన్నారుల కోసం 1.85 లక్షల డోసులు సిద్ధం: డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాబాయి
మచిలీపట్నం టౌన్, మార్చి 2: జిల్లాలోని 1,153 పల్స్‌పోలియో కేంద్రాల్లో ఆదివారం నూరుశాతం పోలియో చుక్కలు వేసి జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్యసిబ్బందికి వైద్య ఆరోగ్యశాఖ కృష్ణాజిల్లా అధికారి డాక్టర్ జి.గీతాబాయి పిలుపుని చ్చారు. శనివారం నగరంలో నిర్వహించిన ర్యాలీని గీతాబాయి నిర్వహిం చారు. గ్రామీణ ప్రాంతాల్లో 956, పట్టణ ప్రాంతాల్లో 127 పోలియో కేం ద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. ఐదేళ్లలోపు 1,39,180 మంది పిల్లలున్నారని, వీరికి కావలసిన 1,85,240 డోసులను సిద్ధం చేశామని తెలిపారు. 62 మొబైల్ పోలియో కేంద్రాలు, 23 ట్రాన్సిట్ పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. 4,898 మంది సిబ్బందిని ఇందుకు నియమించామన్నారు. మార్చి 3న పల్స్‌పోలియో కేంద్రం స్థాయిలో చుక్కలు వేస్తారని, 4, 5 తేదీల్లో మిగిలిపోయిన పిల్లలకు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ, విద్యాశాఖతో పాటు ఇతర శాఖల ఉద్యోగులు భాగస్వాముల వుతారన్నారు. జిల్లాలో 158 హైరిస్క్ ప్రాంతాలైన ఇటుక బట్టీలు, క్రషర్స్‌లలో, సంచార జాతుల వారిని సర్వే చేసి గుర్తించామని, వారికీ పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఈ ర్యాలీలో ఐడీవో డాక్టర్ సీతాకుమారి, డాక్టర్ నాగభవాని, వైద్యాధికారి డాక్టర్ పి. సుష్మ, నర్సింగ్ కళాశాల సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.