విద్యారంగంలో కృష్ణాను ప్రథమ స్థానంలో నిలుపుదాం
ABN , Publish Date - Oct 27 , 2024 | 01:09 AM
నూతన విద్యాశాఖాధికారిగా పీవీజే రామారావు బాధ్యతలు స్వీకరించారు.
ఉపాధ్యాయులకు డీఈవో పీవీజే రామారావు పిలుపు
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ‘కృష్ణా జిల్లాలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యారంగంలో జిల్లా ను ప్రథమ స్థానంలో నిలుపుదాం. అందుకు ఉపాధ్యాయులు అంకితభా వంతో పనిచేయాలి.’ అని నూతన డీఈవో పీవీజే రామారావు పిలుపుని చ్చారు. శనివారం నూతన విద్యాశాఖాధికారిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఈవోగా పనిచేసిన తాహెరా సుల్తానా బదిలీపై వెళుతూ రామారావుకు బాధ్యతలు అప్పగించారు. ఈ సంద ర్భంగా నూతన డీఈవో మాట్లాడారు. పదో తరగతిలో మెరుగైన పరీక్షా ఫలితాలు రాబట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు. డీఈవోకు బందరు డీవైఈవో శేఖర్‌సింగ్, ఎంఈవో దుర్గాప్రసాద్, సీఈ బోర్డు సెక్ర టరీ షేక్ జాన్‌సాహెబ్, ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు, ఎం ఈవోలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు స్వాగతం పలికారు.