Share News

డేటా మైండ్స్‌ లెర్నింగ్‌ స్టూడెంట్‌ క్లబ్‌ ప్రారంభం

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:53 AM

పొట్టిశ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు( పీఎస్‌సీఎంఆర్‌) ఇంజనీరింగ్‌ కాలేజీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి పరుచూరి లక్ష్మణస్వామి డేటా మైండ్స్‌ లెర్నింగ్‌ స్టూడెంట్‌ క్లబ్‌, లోగోలను ఆవిష్కరించారు.

 డేటా మైండ్స్‌ లెర్నింగ్‌ స్టూడెంట్‌ క్లబ్‌ ప్రారంభం

డేటా మైండ్స్‌ లెర్నింగ్‌ స్టూడెంట్‌ క్లబ్‌ ప్రారంభం

వన్‌టౌన్‌, జనవరి 6: పొట్టిశ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు( పీఎస్‌సీఎంఆర్‌) ఇంజనీరింగ్‌ కాలేజీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి పరుచూరి లక్ష్మణస్వామి డేటా మైండ్స్‌ లెర్నింగ్‌ స్టూడెంట్‌ క్లబ్‌, లోగోలను ఆవిష్కరించారు. డేటా సైన్స్‌, ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజి, డిజైన్‌ థింకింగ్‌లపై ఈ క్లబ్బు దృష్టి పెడుతుంది. సంబంధిత రంగాలపై ఈవెంట్‌లను, వర్క్‌షాప్‌లను తదితరాలను నిర్వహిస్తుంది. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జే.లక్ష్మీనారాయణ, వైఎస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పతంజలిశాస్త్రిలతో పాటు ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 12:53 AM