Share News

శ్రీలక్ష్మీ తిరుపతమ్మకు ఆషాఢ సారె

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:58 AM

పాత గన్నవరంలోని శ్రీలక్ష్మీతిరుపతమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా సర్వకార్యసిద్థి ప్రదాయిని వారాహిదేవి నవరాత్రుల పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందు లోభాగంగా ఆషాఢమాసం తొలి ఆదివారం సారె, పొంగళ్లను భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు.

 శ్రీలక్ష్మీ తిరుపతమ్మకు ఆషాఢ సారె
శ్రీలక్ష్మీతిరుపతమ్మకు కుటుంబసమేతంగా ఆషాఢ సారెను సమర్పిస్తున్న జాస్తి ఫణిశేఖర్‌, శ్రీవాణి దంపతులు

గన్నవరం(ఉంగుటూరు), జూలై 7 : పాత గన్నవరంలోని శ్రీలక్ష్మీతిరుపతమ్మతల్లి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా సర్వకార్యసిద్థి ప్రదాయిని వారాహిదేవి నవరాత్రుల పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందు లోభాగంగా ఆషాఢమాసం తొలి ఆదివారం సారె, పొంగళ్లను భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు. తొలుత పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులచే అమ్మవారి సారెను సంప్రదాయబద్ధంగా గ్రామ పురవీధులలో ఊరేగిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం జాస్తి ఫణిశేఖర్‌, శ్రీవాణి దంపతులు కుటుంబ సమేతంగా శ్రీలక్ష్మీతిరుపతమ్మకు ఆషాఢ సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీలలిత సహస్రనామపారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, సహస్రనామార్చనలతోపాటు విశేషపూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని వటవృక్షానికి పూజలు నిర్వహించడంతోపాటు అంకమ్మతల్లికి ఆషాఢ బోనం సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి పాటలతో మహిళా భక్తులు నిర్వహించిన కోలాట నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి దంపతులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకట బాలవర్థనరావు, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయకమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:58 AM