Share News

కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:47 AM

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు వుంటుందని గ్రహించి అనేకమంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని గన్నవరం నియోజకవర్గ మూడు పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంక ట్రావు అన్నారు.

 కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు
ఉంగుటూరులో మూడు పార్టీల ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడుతున్న యార్లగడ్డ

ఉంగుటూరు, ఏప్రిల్‌ 3 : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు వుంటుందని గ్రహించి అనేకమంది వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని గన్నవరం నియోజకవర్గ మూడు పార్టీల కూటమి ఉమ్మడి అభ్యర్థి యార్లగడ్డ వెంక ట్రావు అన్నారు. ఉంగుటూరులో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరారు. పొట్టిపాడుశివారు ఆనందపురానికి చెందిన వైసీపీ నాయకులు కాకి జయంతిబాబు, తురక షడ్రక్‌ శేషగిరిరావు (చంటి), లంకపల్లికి చెందిన పి. గాబ్రియేలు, వేములకొండ బాబు, వేమినీడు వెంకటేశ్వరరావు, జె.పుల్లయ్య, ఉంగుటూరుకు చెందిన ఈడ్పుగంటి కృష్ణమూర్తి, మరో 35 కుటుంబాలకు చెందిన నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్‌, మండవ రమ్య, బచ్చుల బోసు, కొండేటి కొండలు, కొండేటి వెంకటేశ్వరరావు, మండల పరిధిలోని అన్నిగ్రా మాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌ పక్కాగా వుండాలి

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు విజయం సాధించాలంటే పోల్‌ మేనేజ్‌మెంట్‌ పక్కాగా వుండాలని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఉంగుటూరులో టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, బూత్‌లెవెల్‌ ఏజెంట్లతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టతపై గ్రామాల వారీగా పార్టీశ్రేణులతో సమీక్ష జరిపారు. మూడుపార్టీల నాయకులు సమన్వ యంతో కలిసికట్టుగా పనిచేస్తూ భారీ మెజార్టీ సాధించేలా కృషిచేయాలని, ఏమైనా ఇబ్బందులు వుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. మూడు పార్టీల సానుభూతిపరులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఓటింగ్‌లో పాల్గొనేలా కృషిచేయాలన్న ఆయన ఎన్నికల్లో దొంగ ఓట్లు పడకుండా అడ్డుకోవాలన్నారు. ముందుగానే ఓటరు లిస్టులు పరిశీలించి ఓటర్లపై అవగాహనకు రావాలని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో గన్నవరం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్థి జరగలేదన్న ఆయన తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలతోపాటు గన్నవరం భవిష్యత్తును మారుస్తానని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ పాలన తీరుపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో వున్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీడీపీకి అనుకూల ఓటుగా మలచి ఓటింగ్‌ చేయించాల్సిన బాధ్యత పార్టీశ్రేణులపై వుందని పేర్కొన్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:47 AM