Share News

కూటమితోనే ప్రజాసంక్షేమం

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:00 AM

చంద్రబాబు నాయుడి సమర్థ నాయకత్వం, సుపరి పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు విశ్వసి స్తున్నారని, మూడు పార్టీల కూటమితోనే ప్రజాసం క్షేమం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్థి సాధ్యమని వైసీపీ నాయకులు, కార్యకర్తలు గ్రహించారని, అందుకే వైసీపీని వీడి స్వచ్ఛందంగా టీడీపీలోకి చేరుతున్నారని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

కూటమితోనే ప్రజాసంక్షేమం
హనుమాన్‌జంక్షన్‌లో పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలతో యార్లగడ్డ వెంకట్రావు

ఉంగుటూరు, ఏప్రిల్‌ 2 : చంద్రబాబు నాయుడి సమర్థ నాయకత్వం, సుపరి పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజలు విశ్వసి స్తున్నారని, మూడు పార్టీల కూటమితోనే ప్రజాసం క్షేమం, రాష్ట్రం సర్వతోముఖాభివృద్థి సాధ్యమని వైసీపీ నాయకులు, కార్యకర్తలు గ్రహించారని, అందుకే వైసీపీని వీడి స్వచ్ఛందంగా టీడీపీలోకి చేరుతున్నారని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మండలంలోని నాగవరప్పాడు, వెల్దిపాడు, కొయ్యగూరపాడు, ఎలుకపాడు గ్రామాలకు చెందిన సుమారు 300 మంది బీసీ, ఎస్సీ కార్యకర్తలు మంగళవారం వైసీపీ ని వీడి యార్లగడ్డ సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు. వీరందరికీ యార్లగడ్డ వెంకట్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పతనమైపో యిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మూడు పార్టీల కూటమికి ప్రజలు మద్దతు పల కాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కొయ్యగూ రపాడు మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు పిడికిటి రత్నప్రసాద్‌(నాని), టీడీపీ మండల అధ్యక్షుడు ఆరు మళ్ల వెంకటకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనోక్‌ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ పాలనలోనే అభివృద్ధి

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: టీడీపీ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు టీడీపీ వైపునకు ఆకర్షితులవుతు న్నారని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. హను మాన్‌జంక్షన్‌లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో బాపులపాడు మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారికి ఆయన కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కానుమోలు ఆటో యూనియన్‌కు చెందిన ఘంటా లక్ష్మణరావు, కాటుమాల ఆనంద్‌ బాబు, నారాయణపురానికి చెందిన మావులూరి కిషోర్‌, కొలుసు సతీష్‌, నారాయణ, కంచర్ల నాగబాబు, ఆరుగొలను వైసీపీ మాజీ కన్వీనర్‌ కళ్లెం సుదర్శన్‌, ఇందిరానగర్‌కు చెందిన మెట్టు జగదీష్‌, చీలి జోజి, గోళ్ల రమేష్‌, కోలా నిఖిల్‌, నాగెళ్ల మం గయ్య, తలారి వెంకటేశ్వరరావు, మాలిన అంజి, చీలి మరియ దాసు, మురళి, తలారి జోషి, ముత్యాల భాగ్యరాజు, పోలిమెట్ల వికాస్‌, నరాలశెట్టి మధు, అప్పల నాయుడు, కోమవరపు శివయ్య, హనుమాన్‌నగర్‌కు చెందిన కటికల రాజేష్‌ కుటుంబ సభ్యులు, తదితరులు వైసీపీ నుంచి టీడీపీ చేరగా యార్లగడ్డ వెంకట్రావు వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, చిరుమామిళ్ల సూర్యం, ఆళ్ల గోపాలకృష్ణ, గుండపనేని ఉమావరప్రసాద్‌, మూల్పూరి సాయికళ్యాణి, వేగిరెడ్డి పాపారావు, మొవ్వా వెంకటేశ్వరరావు, వడ్డిల్లి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 01:00 AM