ఉధృతంగా కృష్ణమ్మ
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:00 AM
ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతోంది. ఎగువ నుంచి 2లక్షల28వేల328 క్యూసెక్కుల వరద వస్తోంది.
ప్రకాశం బ్యారేజీ వద్దకు మరో 2 లక్షల క్యూసెక్కులు
విజయవాడ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలతో ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతోంది. ఎగువ నుంచి 2లక్షల28వేల328 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను ఐదడుగుల మేర పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 1.80 లక్షలు, పాలేరు నుంచి 510, కీసర నుంచి 58,600 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీటి నుంచి కేఈ ప్రధాన కాల్వకు 5,309, కేడబ్ల్యూ కాల్వకు 2,519 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి ఈ వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం మరింత తగ్గే అవకాశాలున్నాయి.