Share News

కృష్ణా జిల్లా బరిలో అభ్యర్థులు..

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:37 AM

సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాల లెక్కతేలింది. కృష్ణాజిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు 79మంది అభ్యర్థులు, మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి 15మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం టీడీపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ ఇతరపార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు.

కృష్ణా జిల్లా బరిలో అభ్యర్థులు..

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాల లెక్కతేలింది. కృష్ణాజిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలకు 79మంది అభ్యర్థులు, మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి 15మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం టీడీపీ, జనసేన, వైసీపీ, కాంగ్రెస్‌ ఇతరపార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన గుర్తులను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించారు. నియోజకవర్గాల వారీగా పోటీలో ఉన్న ప్రధానపార్టీల అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

ఫ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి 28 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో మూడింటిని అధికారులు తిరస్కరించారు. ఉపసంహరణ గడువు ముగిసేసమయానికి 10మంది అభ్యర్థులు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. పోటీలో 15మంది ఉన్నారు. ప్రధాన పార్టీల తరపున జనసేనపార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి, వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా గోళ్ల కృష్ణ పోటీలో ఉన్నారు.

ఫ అవనిగడ్డ నియోజకవర్గంలో 16మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలనలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరించారు. సోమవారం మరో అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నియోజకవర్గంలో 12మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమే్‌షబాబు, జనసేన అభ్యర్థ్థి మండలి బుధ్దప్రసాద్‌, కాంగ్రె్‌స అభ్యర్థి అందె శ్రీరామమూర్తి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

ఫ పెనమలూరు నియోజకవర్గంలో 11మంది పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో 17 నామినేషన్లు దాఖలు చేయగా.. ఐదు నామినేన్లను అధికారులు తిరస్కరించారు. సోమవారం ఒకరు నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు.. కాంగ్రె్‌స అభ్యర్థి ఎలిసెల సుబ్రహ్మణ్యం, వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్‌, టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ ప్రధానపార్టీల తరపున పోటీలో ఉన్నారు.

ఫ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి 26 నామినేషన్‌లు దాఖలుకాగా వాటిలో తొమ్మిది నామినేషన్‌లను పరిశీలన సమయంలో అధికారులు తిరస్కరించారు. నామినేషన్‌ల ఉపసంహరణ రోజున ఐదుగురు తమ నామినేషన్‌లను ఉపసంహరించుకున్నారు. 12మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా వడ్డాది గోవిందరావు ప్రధానపార్టీల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

ఫ పెడన నియోజకవర్గంలో 12 నామినేషన్లు దాఖలుకాగా నామినేషన్ల పరిశీలనలో రెండింటిని అధికారులు తిరస్కరించారు. 10మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సోమవారం అభ్యర్థులు ఎవ్వరూ నామినేషన్‌లను ఉపసంహరించుకోలేదు. టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్‌, వైసీపీ అభ్యర్థిగా ఉప్పాల రమేశ్‌(రాము), కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా శొంఠి నాగరాజు ప్రధానపార్టీల అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

ఫ గన్నవరం నియోజకవర్గంలో 24 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో పది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. సోమవారం రెండు నామినేషన్‌లను ఉపసంహరించకున్నారు. 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్‌, వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్‌, సీపీఎం అభ్యర్థిగా కళ్లం వెంకటేశ్వరరావు ప్రధానపార్టీల పోటీలో ఉన్నారు.

ఫ పామర్రు నియోజకవర్గంలో 11 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో మూడు నామినేషన్‌లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు అభ్యర్థులు ఎవ్వరూ తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోలేదు. టీడీపీ అభ్యర్థిగా వర్లకుమార్‌ రాజా, వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్‌కుమార్‌, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా డీవైదాస్‌ ప్రధానపార్టీల తరపున పోటీలో ఉన్నారు.

ఫ మచిలీపట్న నియోజకవర్గంలో 17 నామినే షన్లు దాఖలు కాగా పరిశీలనలో మూడు నామినేషన్‌లను అధికారులు తిరస్కరించారు. సోమవారం అభ్యర్థులు ఎవ్వరూ తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోలేదు. దీంతో 14మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా కొల్లు రవీంద్ర, వైసీపీ అభ్యర్థిగా పేర్ని వాకసాయికృష్ణమూరి(కిట్టు), కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా అబ్ధుల్‌ మతీన్‌ ప్రధాన పార్టీల తరపున పోటీలో ఉన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:37 AM