Share News

కొదమసింహాల్లా పోరాడాలి

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:51 AM

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కొదమసింహాల్లా పోరాడాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్ధి బోడె ప్రసాద్‌, టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు పిలుపునిచ్చారు. బుధవారం కానూరులోని వెలగపూడి శంకరబాబు కార్యాలయంలో జరిగిన మొదటి క్లస్టరు టీడీపీ శ్రేణుల సమావేశంలో వారు మాట్లాడారు.

 కొదమసింహాల్లా పోరాడాలి
కానూరు వెలగపూడి శంకరబాబు కార్యాలయంలో మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌

టీడీపీ శ్రేణులకు పార్టీ నాయకులు బోడె ప్రసాద్‌, వెలగపూడి, అనుమోలు పిలుపు

పెనమలూరు, మార్చి 27 : వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కొదమసింహాల్లా పోరాడాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్ధి బోడె ప్రసాద్‌, టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు పిలుపునిచ్చారు. బుధవారం కానూరులోని వెలగపూడి శంకరబాబు కార్యాలయంలో జరిగిన మొదటి క్లస్టరు టీడీపీ శ్రేణుల సమావేశంలో వారు మాట్లాడారు. సైకో జగన్‌రెడ్డిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రజల వద్దకు టీడీపీ శ్రేణులు వెళ్లి టీడీపీ జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలోని అంశాలను వివరించి తద్వారా ఒక్కో ఇంటికి చేకూరే లబ్ధిని వివరించాలని కోరారు. పార్టీలో అసంతృప్తులు ఎవరయినా ఉంటే సమాచారాన్ని వెంటనే తమకు తెలపాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో షేక్‌ బుజ్జి, చలసాని రాము, సంగెపు రంగారావు, పీతా గోపీచంద్‌, శొంఠి శివరాంప్రసాద్‌, షేక్‌ ఇమాం, శ్రీహరి, మధు, రామకృష్ణ, కొండ్రు కోటేశ్వరరావు, కోసూరి రమేష్‌, సుంకర సాయి, చైతన్య, ఇక్బాల్‌, బూత్‌ కన్వీనర్లు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.

ఆకునూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి..

ఆకునూరు(ఉయ్యూరు) : వైసీపీ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు మేలు జరుగకపోగా పెచ్చుమీరిపోయిన దాడులు, అరాచకాలతో విసిగి పోయి వైసీపీనుంచి టీడీపీలో చేరేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారని టీడీపీ పెనమలూరు నియో జకవర్గ ఇన్‌చార్జ్‌ బోడె ప్రసాద్‌ అన్నారు. ఆకునూ రులో వైసీపీకి చెందిన పలువురు టీడీపీలో చేరగా వారికి ్టకండువా కప్పి బోడె ప్రసాద్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఫ ఆకునూరులో పార్టీ కారాల్యయాన్ని బోడె ప్రసాద్‌ పార్టీ నాయకులతో కలసి ప్రారంభించారు. పార్టీ మండల అధ్యక్షుడు యెనిగళ్ల కుటుంబరావు, సర్పంచ్‌ వసంతకుమార్‌, వెలగ పూడి వెంక న్న, కాకాని శ్రీనివాసరావు, పొట్లూరి మురళి, వరప్ర సాద్‌, తాతబ్బాయి, కొండా ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:51 AM