కొడాలి నానీకి షాక్ !
ABN , Publish Date - Jul 17 , 2024 | 01:18 AM
గత పదేళ్లుగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆక్రమణలో ఉన్న శరత్ థియేటర్‌కు విముక్తి లభించింది. థియేటర్‌లోని వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫొటోలు తొలగించారు. థియేటర్‌ను యాజమాన్యానికి అప్పగించారు.
వాటాదారులకు శరత్ థియేటర్ స్వాధీనం
థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించి లాక్కున్న మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని
ఎమ్మెల్యే వెనిగండ్లకు యాజమాన్యం ఫిర్యాదు
సొంత ఆఫీసును ఖాళీ చేయించిన వైనం
కొడాలి నాని, పార్టీ ఫ్లెక్సీల తొలగింపు
గుడివాడ : గత పదేళ్లుగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆక్రమణలో ఉన్న శరత్ థియేటర్‌కు విముక్తి లభించింది. థియేటర్‌లోని వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫొటోలు తొలగించారు. థియేటర్‌ను యాజమాన్యానికి అప్పగించారు. కేవలం ఒక్క వాటా హక్కు కలిగిన నాని మిగిలిన ముగ్గురు వాటాదారులను బెదిరించి మొత్తం థియేటర్‌ను తన ఆధీనంలో ఉంచుకున్నారు. గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని థియేటర్ యాజమాన్యాన్ని బెదిరించి అక్రమించుకుని తన సొంత కార్యాలయంగా మార్చుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నాని చిత్తుచిత్తుగా ఓడిపోయారు. నాని ముఖం చాటేసి గుడివాడ వదిలి హైదరాబాద్‌లో తలదాచుకుంటున్నారు. శరత్ థియేటర్ పాత యాజమాన్యంలోని ముగ్గురు వాటాదారులు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రామును కలిసి తమక న్యాయం చేయాలని కోరారు. రంగంలోకి దిగిన వెనిగండ్ల... నాని అక్రమాలకు చెక్ చెడుతూ పాత యాజమాన్యానికి థియేటర్‌ను అప్పగించారు.
థియేటర్‌లో టీ పార్టీ
వాటాదారుల్లో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు థియేటర్‌లో మంగళవారం టీ పార్టీ ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావులతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల మాట్లాడుతూ అందరికి న్యాయం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ థియేటర్ యజమానులకు హక్కును వారికి కల్పించేందుకు వచ్చామన్నారు. శరత్ థియేటర్ వాటాదారులు యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏళ్ల తరువాత తన ఆస్తిని చూసుకునేందుకు రావడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.