దేశం గర్వపడే ఇంజనీరు కేఎల్ రావు
ABN , Publish Date - Jul 16 , 2024 | 01:00 AM
దేశం గర్వపడే ఇంజనీరు డాక్టర్ కేఎల్ రావు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
గొల్లపూడి, జూలై 15: దేశం గర్వపడే ఇంజనీరు డాక్టర్ కేఎల్ రావు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కేఎల్ రావు జయంతిని పురష్కరించుకొని గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఉమా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నీటిపారుదల రంగానికి కేఎల్‌రావు చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
నందిగామలో..
నందిగామ రూరల్: గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ కేఎల్ రావు జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. గాంధీ సెంటర్‌లో కేఎల్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. పోలవరపు సదాశివరావు, కేదార్‌నాథ్ శర్మ, నందిరాజు ప్రకాష్, నరసింహారావు, లక్ష్మణరావు, ఈశ్వరప్రగడ రంగారావు, వాచస్పతి, వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.