ప్రతి పార్లమెంట్ కేంద్రంలో కాపు విద్యాభవన్లు
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:55 AM
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కాపు విద్యాభవన్లు అందుబాటులోకి తెస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం తెలిపారు.

కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం
గవర్నర్‌పేట, జూలై 7: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో కాపు విద్యాభవన్లు అందుబాటులోకి తెస్తున్నామని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం తెలిపారు. కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న కాపు విద్యాభవన్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వ హించారు. బాలికల కోసం కృష్ణలంకలో ఏర్పాటు చేసిన కాపు విద్యాభవన్-1ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. పేద కాపు విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో విద్యాభవన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. కాపునాడు అనుబంధ కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని గాళ్ల సుబ్రమణ్యం తెలిపారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు అర్జా రామకృష్ణ, కాపునాడు సిద్ధాంతకర్త లక్కినేని ప్రసాద్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.