కందిపప్పు, పంచదార ఫుల్
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:10 AM
ఐదేళ్ల తర్వాత రేషన్‌డిపోలకు ఫుల్లుగా కందిపప్పు, పంచదార వచ్చిం ది.

ఐదేళ్ల తర్వాత రేషన్ డిపోలకు..బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు రూ.180 పైనే
రేషన్ దుకాణంలో కిలో రూ.67 ..కార్డుదారులందరికీ నవంబరులో సరఫరా
సీఎంకు డీలర్ల ధన్యవాదాలు
(ఆంధ్రజ్యోతి-మొగల్రాజపురం)
ఐదేళ్ల తర్వాత రేషన్‌డిపోలకు ఫుల్లుగా కందిపప్పు, పంచదార వచ్చిం ది. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రన్న క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ కానుకలు ఇస్తూ కార్డుదారులకు ప్రతినెలా కందిపప్పు, పంచదార, గోధుమపిండి, రాగులు, జొన్నలు అందించేవారు. 2019లో వైసీపీ ప్రభుత్వ మొచ్చాక డోర్ డెలివరీ పేరుతో ఎండీయూ వాహనాలు తీసుకొచ్చింది. సరుకుల్లో కోతపెట్టి కార్డుదారులకు బియ్యంతో సరిపుచ్చింది. అడపాదడపా ఒక్కో షాపునకు క్వింటా, అరక్వింటా కందిపప్పు, సగం పంచదార ఇచ్చే వారు. టీడీపీ హయాంలో కందిపప్పు కిలో రూ.40, పంచదార అరకిలో రూ.6.50 ఉండేవి. వైసీపీ ప్రభుత్వం రాగానే కందిపప్పు కిలో రూ.67, పంచదార అరకిలో ప్యాకెట్ రూ.17కు పెంచింది. ధర పెంచినా సరుకులు పూర్తిగా ఇచ్చేవారు కాదు. కార్డుదారులకు సరుకులు లేక డీలర్లకు కమీషన్ రాక ఇబ్బందులు పడేవారు. కూటమి ప్రభుత్వమొచ్చాక సీఎం చంద్ర బాబు, మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు రూ.కిలో 180కి పైగా పలుకుతుండడంతో రాష్ట్రం లోని కార్డుదారులందరికీ కందిపప్పు అందించాలనే లక్ష్యంతో రెండు నెలల కిత్రం టెండర్లు పిలిచారు. గత నెల సరఫరాదారుల నుంచి సరుకు రావ డం మొదలైంది. ఈనెల 20వ తేదీకే అన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు సరు కులు పూర్తిగా తరలించి సిద్ధంగా ఉంచారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 11,31, 103 కార్డులు ఉన్నాయి. ఎన్టీయార్ జిల్లాలో 5,97,815 కార్డులు, కృష్ణాజి ల్లాలో 5,33,288 కార్డులు ఉన్నాయి. నవంబరులలో కార్డుదారులందరికీ కందిపప్పు, పంచదార ఇవ్వబోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కంది పప్పు రూ.180 ఉండడంతో సామాన్యుడు ఇబ్బంది పడకుండా రైతు బజా ర్లలో ఇప్పటికే కందిపప్పు కౌంటర్లు తెరచి కిలో రూ.110కే అందిస్తున్నారు.
ఐదేళ్ల తర్వాత డీలర్ల ఆనందం
కరోనా కాలం నుంచి మోదీ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన కమీషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల గోడౌన్ ఖాతాలో వేసింది. ఈ కమీషన్‌తో కంది పప్పు, పంచదార విడిపించుకునే అవకాశం లేక కమీషన్ పూర్తిస్థాయిలో చేతికి రాక డీలర్లు గతంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. తాజాగా సీఎం చంద్రబాబు నిర్ణయంతో డీలర్లు గోడౌన్ ఖాతాలో ఉన్న కమీషన్‌తో ఈనెల కందిపప్పు, పంచదార విడిపించుకుంటున్నారు. ఐదేళ్ల తర్వాత దుకాణాలకు పూర్తిస్థాయిలో సరుకులు వచ్చాయని కందిపప్పు, పంచదార కమీషన్ రూపంలో కాస్తంత ఆదాయం పెరుగుతుందని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. సీఎంకు ధన్యవాదాలు చెబుతున్నారు.