Share News

కల్యాణం.. కమనీయం..

ABN , Publish Date - Apr 18 , 2024 | 01:20 AM

అభయాంజ నేయస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు కనుల పండు వగా నిర్వహించారు. ఆలయం వెనుక భాగంలో ఉన్న వేదికపై ఈవో కె.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు కల్యా ణాన్ని జరిపించారు. భద్రాచలం రాముడి పాదాల చెంత నుంచి తెచ్చిన ప్రత్యేక తలంబ్రాలు బియ్యం, ముత్యాలు కల్యాణంలో అర్చకులు వినియోగించారు.

 కల్యాణం.. కమనీయం..
అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో సీతారాముల కల్యాణోత్సవం

హనుమాన్‌జంక్షన్‌, ఏప్రిల్‌ 17: అభయాంజ నేయస్వామి ఆలయంలో బుధవారం సీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు కనుల పండు వగా నిర్వహించారు. ఆలయం వెనుక భాగంలో ఉన్న వేదికపై ఈవో కె.శ్రీనివాస్‌ పర్యవేక్షణలో అర్చకులు గొట్టిపాళ్ల శ్రీనివాసాచార్యులు, రామాచార్యులు కల్యా ణాన్ని జరిపించారు. భద్రాచలం రాముడి పాదాల చెంత నుంచి తెచ్చిన ప్రత్యేక తలంబ్రాలు బియ్యం, ముత్యాలు కల్యాణంలో అర్చకులు వినియోగించారు. కల్యాణోత్సవంలో ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్‌ నెరుసు నాగభూషణం దంపతులతో పాటు మరో 8జంటలు పాల్గొన్నారు. ప్రధాన అలయంలో అర్చకులు మారేపల్లి సీతారామానుజాచార్యులు పర్యవేక్షణలో అభయాంజనేయ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీరాముడు ఆదర్శపాలన చేశాడని అర్చకులు శ్రీనివాసరావు, ఆళ్ల గోపాలకృష్ణ వేర్వేరు కార్యక్రమాల్లో తెలిపారు. కాకులపాడు కోందడరా మాలయంలో అర్చకులు శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎనికేపల్లి శ్రీనివాసరావు దంపతులు సీతారామ కల్యాణం నిర్వహించారు. కానుమోలులోని కోందడ రామాలయంలో కొండపల్లి హరిబాబు, చిన్నాల సత్యగణేష్‌బాబు దంపతులు కల్యాణం నిర్వహిం చారు. వీరవల్లిలో షిరిడి సాయి మందిరంలో రావి శ్రీరామ్‌, కుసుమ దంపతులు కల్యాణం నిర్వ హించారు. రంగన్నగూడెంలోని పురాతన రామాల యంలో ఆళ్ల గోపాలకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుగొలను, రేమల్లె, ఓగిరాల, మల్ల వల్లి, కొత్తపల్లిలో సీతారామకల్యాణం నిర్వహించారు.

పెనమలూరు : పెనమలూరు మండలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు శ్రీరాముని దర్శనం కోసం మండేఎండలను సైతం లెక్క చేయకుండా రామాలయాల వద్ద బారులు తీరా రు. ఆయా ఆలయాల నిర్వాహక కమిటీల సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎండదెబ్బ తగలకుండా చలువ పందిళ్లు వేయించారు. ఆలయ ప్రాంగణాల్లో భక్తులకు పానకం వడపప్పులు పంపిణీ చేశారు. పెనమలూరు, కానూరు, పోరంకి సీతాపురం కాలనీ, తాడిగడప రామాలయాల్లో జరిగిన కల్యాణాల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. పెదపులిపాక రామాలయం వద్ద గ్రామ సర్పంచి గుంటూరు శ్రీనివాసచౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఉయ్యూరు : శ్రీరామనవమి పర్వదినం పురస్క రించుకుని వాడవాడలా సీతారామ కల్యాణం నేత్ర పర్వంగా నిర్వహించారు. ఉయ్యూరు పట్టణం, మండ ల పరిధి గ్రామాల్లో బుధవారం రామాలయాలు, ఆంజనేయస్వామి మందిరాలతో పాటు పలు కూడ ళ్లలో పందిళ్లువేసి సీతారామకల్యాణం వైభవంగా జరి పించారు. ఉయ్యూరులో గౌడ రామాలయం, కాపుల రామాలయం, పంచపట్టాభిరామస్వామి ఆలయం, రత్న రెసిడెన్సీ, శివాలయం రోడ్డులో రామమందిరం వద్ద పెద్ద పందిళ్లు వేసి స్వామివారి కల్యాణం వేడు కగా నిర్వహించారు. రత్నరెసిడెన్సీ, గౌడ రామాల యం, కాపుల రామాలయం వద్ద జరిగిన కళ్యాణోత్స వంలో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌, పలియాల శ్రీనివాస్‌, జనసేన నాయకుడు కార్తీకేయ పాల్గొన్నారు. గండిగుంట, పెదఓగిరాల, ఆకునూరు, చినఓగిరాల, కడవకొల్లు ముదునూరు, శాయిపురం, కాటూరు, బోళ్లపాడు గ్రామాల్లో శ్రీరామనవమి వేడుక నిర్వహించారు. ఫ కోదండరామస్వామి రథోత్సవం, గ్రామోత్సవం కనుల పండువగా నిర్వహించారు. శ్రీరామనవమి పురస్క రించుకుని పాత స్టేట్‌ బ్యాంకు రోడ్డులోని కోదండ రామస్వామి ఆలయంలో ఉదయం సీతారామ కల్యాణం, పూజలు నిర్వహించి సాయం త్రం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రాము, వీరంకి సత్యనారాయణ, బా లాజీ, వెంకటేశ్వరరావు, దివి చిన్మయ పాల్గొన్నారు.

గన్నవరం : మండలంలో శ్రీరామనవమి వేడుక లను ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని రామాల యాల వద్ద చలువ పందిళ్లు వేసి సీతారాముల కల్యా ణాన్ని వేద పండితులు అంగరంగా వైభవంగా జరి పారు. పలువురు దంపతులు పీటలపై కూర్చుని కల్యాణం చేయించారు. వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యంలో స్వామివారికి పూజలు చేశారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు కెవిఆర్‌ కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. దావాజీగూడెం సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రామాచార్యులు విశేష పూజలు చేశారు. స్వామి వారిని కొత్తగా తయారు చేసిన రథంపై శోభయాత్ర నిర్వ హించారు. సూరంపల్లి, పురుషోత్తపట్నం, ముస్తాబా ద, తెంపల్లి, వీరపనేనిగూడెం, చిక్కవరం తదితర గ్రామాల్లో నవమి వేడుకలు జరిగాయి.

ఉంగుటూరు : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల వ్యాప్తంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే భక్తులు శ్రీసీ తారాములకు ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహిం చారు. మధ్యాహ్నం 12గంటలకు అభిజిత్‌ ముహూర్త సమయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్థలతో నిర్వ హించారు. లంకపల్లి ఆగ్రహరం కోదండరామస్వామి ఆలయంలో రాములోరి కల్యాణోత్సవం అత్యంత వైభవం గా జరిగింది. ఆలయ అర్చకులు చదలవాడ కుమార స్వామి, శివనాగేశ్వరరావు, నాగలింగం ప్రసాద్‌శర్మల వేదమంత్రాలనడుమ జల్లెడ సాయికృష్ణ దంపతులు కల్యాణ తంతును శాస్త్రోక్తంగా జరిపిం చారు. పెద అవుటపల్లిలో స్థానిక పెద్దరామాలయం, చిన్నరా మాలయం, గౌడపేట రామాలయంలో రాములోరి కల్యాణం కనులపండువగా జరిగింది.

Updated Date - Apr 18 , 2024 | 01:20 AM