Share News

జోరుగా కోడి పందేలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 01:28 AM

ఉయ్యూరు మండల పరిధి గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఆధ్వ ర్యంలో కోడి పందేలు, పేకాట, చిన్న పెద్ద బజార్‌ పెద్దయెత్తున జరిగాయి. బోళ్లపాడు, ఆకునూరు, పెదఓగిరాల గ్రామాల్లో భారీగా బరిలువేసి కోడి పందేలు, పేకాట నిర్వహించారు.

 జోరుగా కోడి పందేలు
బోళ్లపాడులో కోడిపందేలు తిలకిస్తున్న ప్రజలు

ఉయ్యూరు, జనవరి 16 : ఉయ్యూరు మండల పరిధి గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఆధ్వ ర్యంలో కోడి పందేలు, పేకాట, చిన్న పెద్ద బజార్‌ పెద్దయెత్తున జరిగాయి. బోళ్లపాడు, ఆకునూరు, పెదఓగిరాల గ్రామాల్లో భారీగా బరిలువేసి కోడి పందేలు, పేకాట నిర్వహించారు. కోడి పందేలు తిలకించేందుకు మహిళలు, యువతులు సైతం తరలి రాగా నిర్వాహకులు వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు జరిగిన పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారా యి. బుల్లెట్ల బహుతి ఆకునూరు, బోళ్లపాడు కోడి పందేల్లో ఎక్కువ పందేలు గెలుచుకున్నవారికి మోటార్‌ సైకిళ్లు బహుమతిగా అందజేశారు. బోళ్లపా డులో ఎంపీటీసీ గంగారత్నం, సీడీసీ చైర్మన్‌ రాజులపాటి రామచంద్రరావు తదితరులు పందేలు తిలకించారు.

అంపాపురం బరి వద్ద తోపులాట

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : అంపాపురం బరివద్ద మంగళవారం సాయంత్రం యువకుల మధ్య గొడవ చిలికి చిలికి దాడులు చేసేంతగా మారింది. మంగళ గిరి, పెదఅవుటపల్లికి చెందిన యువకులు కోడిపందేల గురించి గొడవ పడుతూండగా, కోడూరుపాడుకు చెందిన రామినేని చంటి సర్ధిచెప్పేందుకు ప్రయత్నిం చాడు. రామినేని చంటికి మద్దతుగా వెళ్లిన ఆళ్ల భాను, సమ్మెట సాయి, నాగరాజులపై యువకులు దుర్భాష లాడుతూ ద్విచక్రవాహనంలోగల స్కూడ్రైవర్‌తో దాడి చేశారు. భానును స్కూడ్రైవర్‌తో గాయపరచి పక్కనే ఉన్న చంటి అనే వ్యక్తి వద్ద గల నగదును, మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని పారిపోయారని బాధితులు తెలిపారు. కోసు నిర్వహణలో జరిగిన చిన్నపాటి గొడవను పెద్దది చేస్తున్నారని నిర్వాహకులు భానుపై మండిపడ్డారు.బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

Updated Date - Jan 17 , 2024 | 01:28 AM