స్ట్రాంగ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా జాన్‌బాబు
ABN , Publish Date - Nov 28 , 2024 | 01:07 AM
దక్షిణ భారత పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియం లిఫ్టర్ పెద్ది జాన్‌బాబు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించాడు.

గుడివాడ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): తమిళనాడు, సేలంలో ఈనెల 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన దక్షిణ భారత పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియం లిఫ్టర్ పెద్ది జాన్‌బాబు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించాడని స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్టేడియం కమిటీ కార్యాలయంలో జాన్‌బాబును ఆయన అభినందించారు. 74కేజీల శరీర బరువు విభాగంలో 615 కేజీలు ఎత్తి బంగారు పతకం సాధించి స్ర్టాంగ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియాగా జాన్‌బాబు నిలిచారన్నారు. కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్, కోచ్ మారెళ్ల వెంకటేశ్వరరావు, మేనేజర్ ఎం.సత్యనారాయణ పాల్గొన్నారు.