Share News

టీడీపీలోకి జోగి రమేశ్‌ బంధువులు

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:19 AM

ఇబ్రహీంప ట్నంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మంత్రి జోగి రమేశ్‌ బంధువులు ఆయన ఇంటి ముందే సభాస్థలి ఏర్పాటుచేసి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మైలవ రం అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు.

టీడీపీలోకి జోగి రమేశ్‌ బంధువులు
వసంత కృష్ణప్రసాద్‌ సమక్షంలో టీడీపీలో చేరుతున్న మంత్రి జోగి రమేశ్‌ బంధువులు

ఇబ్రహీంపట్నంలో జోగి ఇంటి ముందే చేరికలు

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 19: ఇబ్రహీంప ట్నంలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. మంత్రి జోగి రమేశ్‌ బంధువులు ఆయన ఇంటి ముందే సభాస్థలి ఏర్పాటుచేసి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మైలవ రం అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్‌ సమక్షంలో శుక్రవారం టీడీపీలో చేరారు. జోగి బంధువులు జోగి స్వామి, శ్రీను, జోగి బామ్మర్దులు పామర్తి దుర్గాప్ర సాద్‌, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావు, కిషోర్‌, వేములకొండ కోటేశ్వరరావు, రమేష్‌, కృష్ణ, పుట్టం ప్రభాకరావు, ఏ-1 రెసిడెన్సీకి చెందిన మహిళలు, అపార్ట్‌మెంట్‌వాసులు, మరో 45మందికి కండువాలు కప్పి టీడీపీలోకి వసంత ఆహ్వానించారు.

జోగి సోదరుడి పెత్తనం భరించలేకేనా?

జోగి రమేశ్‌ బంధువులు వైసీపీని వీడటం చర్చకు దారితీసింది. జోగి రమేశ్‌ తమ్ముడు జోగి రాము పెత్తనం భరించలేకా..లేక మంత్రి హోదా ఉన్నా అయినవాళ్లకు కూడా ఏం చేయకపోవడంతో ఆయన బంధువులు పార్టీని వీడుతున్నారని పలువురు చెవు లు కొరుక్కుంటున్నారు. పెనమలూరులో ఉంటూ మైలవరం రాజకీయాల్లో పదేపదే వేలుపెట్టే మంత్రి జోగి.. సొంత బంధువులను ఆయన సామాజికవ ర్గాన్ని వైసీపీని వీడకుండా చూడలేకపోయాడని పలు వురు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంత కసి లేకుంటే ఏకంగా జోగి ఇంటి ముందే వేదిక ఏర్పాటు చేసి ఆయన బావమరుదులు వైసీపీకి గుడ్‌బాయ్‌ చెప్పి ఉంటా రని పలువురు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పని చేయించుకునేందుకు వెళితే అయినోళ్లు, బయటి వాళ్లు అని ఉండదని ఎంతో కొంత ముట్టచెప్పాలని బేరాలు పెడుతుంటాడని అందుకు ఆయన సామా జికవర్గం వారైనా, సొంత వారైనా మినహాయింపు లేదనేది నగ్న సత్యమని పలువురు అంటున్నారు. అన్న అండతో స్థానికంగా తమ్ముడు జోగి రాము ప్రతి విషయంలోనూ పెత్తనం చేయడం పరిపాటిగా మారిందని, పార్టీలో ఆయన పెత్తనం భరించలేక వైసీపీలో చాలా మంది ఇప్పటికే వసంత పంచన చేరారని ప్రచారం జరుగుతోంది. ఎన్టీటీపీఎస్‌ బూడిద చెరువులో లారీలు పెట్టే విషయంలో రాము పెత్తనం అఽధికంగానే ఉంటుందని తెలుస్తోంది.

Updated Date - Apr 20 , 2024 | 01:19 AM