Share News

జూన్‌ 4 వరకు స్ర్టాంగ్‌ రూముల్లో మూడంచెల భద్రత

ABN , Publish Date - May 15 , 2024 | 12:52 AM

సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్ణయాత్మక ప్రజా తీర్పును స్ర్టాంగ్‌ రూముల్లో ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల యంత్రాంగం భద్రపరిచింది. ఇబ్రహీంపట్నం, జూపూడిలలోని నిమ్రా, నోవా కళాళలల్లో మొత్తం నాలుగు భవనాల్లో 27 స్ర్టాంగ్‌ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు.

జూన్‌ 4 వరకు స్ర్టాంగ్‌ రూముల్లో మూడంచెల భద్రత
అధికారుల సమక్షంలో స్ర్టాంగ్‌ రూములకు సీలు వేస్తున్న ఎన్నికల సిబ్బంది

విజయవాడ/ఇబ్రహీంపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి) : సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్ణయాత్మక ప్రజా తీర్పును స్ర్టాంగ్‌ రూముల్లో ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల యంత్రాంగం భద్రపరిచింది. ఇబ్రహీంపట్నం, జూపూడిలలోని నిమ్రా, నోవా కళాళలల్లో మొత్తం నాలుగు భవనాల్లో 27 స్ర్టాంగ్‌ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారు. ప్రజా తీర్పు నిక్షిప్తమై ఉన్న ఈవీఎంలను అత్యంత భద్రత నడుమ సోమవారం పోలింగ్‌ ముగిసిన తర్వాత రిసెప్షన్‌ సెంటర్లకు తరలించారు. అక్కడి నుంచి ప్రధాన స్ర్టాంగ్‌ రూమ్‌లకు తరలించారు. సోమవారం అర్ధ్రరాత్రి వరకు పలు నియోజకవర్గాలలో పోలింగ్‌ కొనసాగటం వల్ల ఈవీఎంలను రిసెప్షన్‌ సెంటర్లలో ఉన్న స్ర్టాంగ్‌ రూమ్‌లలోనే అత్యంత భద్రత నడుమ ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం వరకు ఆయా రిసెప్షన్‌ సెంటర్ల నుంచి ప్రధాన స్ర్టాంగ్‌ రూమ్‌లకు ఈవీఎంలను తరలించారు. నియోజకవర్గాల వారీగా చూస్తే తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నోవా ఇంజనీరింగ్‌ కాలేజీలోని ఇంజనీరింగ్‌ బ్లాక్‌, బిల్డింగ్‌-2లోని స్ర్టాంగ్‌ రూములో ఈవీఎంలను భద్రపరిచారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను నోవా కాలేజీలోని ఇంజనీరింగ్‌ బ్లాక్‌ , బిల్డింగ్‌-2లో భద్ర పరిచారు. సెంట్రల్‌ నియోజకవర్గంలోని ఈవీఎంలను నోవా ఇంజనీరింగ్‌ కాలేజీలోని మెకానికల్‌ బ్లాక్‌, బిల్దింగ్‌-1 లో భద్రపరిచారు. తూర్పు నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను నిమ్రా ఇంజనీరింగ్‌ కాలేజీలోని బిల్డింగ్‌-3 లో భద్రపరిచారు. మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను నిమ్రా మెడికల్‌ కాలేజీలో మెడికల్‌ బ్లాక్‌లోని బిల్డింగ్‌-4లో భద్రపరిచారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను నిమ్రా ఇంజనీరరింగ్‌ కాలేజీకి చెందిన బిల్డింగ్‌-3లో భద్రపరిచారు. ఆయా స్ర్టాంగ్‌రూముల్లో ఈవీఎంలను భద్రపరిచే కార్యక్రమాన్ని జిల్లా జనరల్‌ అబ్జర్వర్‌ మంజూ రాజ్‌పాల్‌, జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావులు పర్యవేక్షించారు. స్ర్టాంగ్‌ రూములకు సింగిల్‌ డోర్‌, సింగిల్‌ కిటికీలు, సింగిల్‌ వెంటిలేటర్లు ఉన్న రూములనే ఎంచుకున్నారు. ప్రతి స్ర్టాంగ్‌ రూముకు కూడా డబుల్‌ లాకింగ్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ వంటివి జరగకుండా ఉండటానికి చర్యలు తీసుకున్నారు. వర్షాలు కురిస్తే లీకేజీల కారణంగా సమస్యలు రాకుండా చర్యలు చేపట్టారు. ప్రతి స్ర్టాంగ్‌ రూమ్‌కు వేసే తాళాల చెవులలో ఒకటి కలెక్టర్‌ ప్రతినిథి దగ్గర, ఒకటి ఆర్వో వద్ద ఉండేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు తరచూ ఈవీఎంలు నిక్షిప్తం చేసిన స్ర్టాంగ్‌ రూములను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలిస్తుంటారు.

Updated Date - May 15 , 2024 | 12:52 AM