Share News

జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:13 AM

ఎన్టీఆర్‌ జిల్లాలో అన్ని విధాలా అభివృద్ధికి అవసరమైన సహాయసహకారాలను అందిస్తామని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఎంపీ నిధుల రూ.5 లక్షలతో ఆధునీకరించిన జిల్లా అర్థగణాంకాధికారి కార్యాలయం, ఎంపీ కేశినేని నాని ఎంపీ నిధులు రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన ఎంపీల్యాండ్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం కనకమేడల, కేశినేనిలు పాల్గొన్నారు.

జిల్లా అభివృద్ధికి పూర్తి సహకారం

కృష్ణలంక, జనవరి 28 : ఎన్టీఆర్‌ జిల్లాలో అన్ని విధాలా అభివృద్ధికి అవసరమైన సహాయసహకారాలను అందిస్తామని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌, లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఎంపీ నిధుల రూ.5 లక్షలతో ఆధునీకరించిన జిల్లా అర్థగణాంకాధికారి కార్యాలయం, ఎంపీ కేశినేని నాని ఎంపీ నిధులు రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన ఎంపీల్యాండ్స్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం కనకమేడల, కేశినేనిలు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కనకమేడల మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కార్యకలాపాలు, ఎంపీల్యాడ్స్‌కు సంబంధించి అర్థ గణాంకాధికారి కార్యాలయం కీలకపాత్ర పోషిస్తోందని, ఈ కార్యాలయం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ నిరాంటంకంగా కార్యకలాపాలు నిర్వర్తించేందుకు వీలుగా జిల్లా అర్థగణాంకాధికారి కార్యాలయం ఆధునీకరణకు అవసరమైన నిధులు అందించడం జరిగిందన్నారు. కలెక్టరేట్‌లో మరిన్ని అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని ఎంపీ కనకమేడల సూచించారు. ఎంపీ కేశినేని శ్రీనివాన్‌ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్‌ దిల్లీరావు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరిస్తూ జిల్లాను అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని, క్షేత్రస్థాయిలో సమస్యలను క్షుణంగా అర్థం చేసుకొని ఆయా సమస్యల పరిష్కారానికి తమదైన శైలిలో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తాగునీటి సమస్య వున్న ప్రాంతాల్లో దాదాపు 275 గ్రామాలకు మంచినీటి ట్యాంకుల ఏర్పాటుకు కలెక్టర్‌ చొరవే కారణమన్నారు. అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో కలెక్టర్‌ చేసిన విజ్ఞప్తి మేరకు మంచినీటి ట్యాంకులను ఎంపీ ల్యాండ్స్‌ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. పార్టీలు, కులాలు, మతాలు, ఇలా దేనితో సంబంధం లేకుండా గ్రామాల నుంచి తీర్మానాలు తీసుకొని ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు సీఎ్‌సఆర్‌, ఎంపీల్యాడ్స్‌ తదితర నిధులతో జిల్లా అభివృద్ధికి కలెక్టర్‌ చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, సీపీఓ వై.శ్రీలత, పంచాయితీ రాజ్‌ ఎస్‌ఈ ఎ.వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ ఏవో ఇంతియాజ్‌ పాషా, ఎన్నికల సెల్‌ సూపరింటెండెంట్‌ సీహెచ్‌.దుర్గాప్రసాద్‌, స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ డీవీఆర్‌ ప్రసాద్‌, డిప్యూటీ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ సీహెచ్‌.సత్యనారాయణ, ఏడీ ఎం.లలితా దేవి, సీపీవో కార్యాలయ సిబ్బంది కె.సాంబశివరావు, ఎం.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 01:13 AM