Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

రేపు జయహో బీసీ సభ

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:06 AM

టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మంగళవారం జయహో బీసీ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా బీసీ సెల్‌ అధ్య క్షుడు మరక శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

రేపు జయహో బీసీ సభ

విజయవంతం చేయండి: మరక శ్రీనివాస్‌యాదవ్‌

విద్యాధరపురం, మార్చి 3: టీడీపీ బీసీ సెల్‌ ఆధ్వర్యంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మంగళవారం జయహో బీసీ సభ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా బీసీ సెల్‌ అధ్య క్షుడు మరక శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సభను విజయవంతం చేయడం కోసం ఆదివారం ఆటోనగర్‌ లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో బీసీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లా నుంచి బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, బీసీల సత్తా చాటాలని శ్రీనివాస్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో బీసీల కోసం ప్రవేశ పెట్టిన ఎన్నోరకాల పథకాలను రద్దు చేసిన బీసీల ద్రోహి జగన్‌రెడ్డి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా జగన్‌రెడ్డి అణగదొక్కాడన్నారు. జగన్‌ రెడ్డి రాక్షసపాలనపై బీసీలు తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. టీడీపీ- జనసేన ప్రభుత్వం బీసీ లకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తుందని ఈ సభలో బీసీ డిక్లరేష న్‌ను ప్రకటిస్తారని ఆయన తెలిపారు. శింగం వెంకన్న, బెజవాడ తిరుపతిగౌడ్‌, కత్తుల మణికంఠ, కరణం వెంకటరమణ, పిల్లి రామ్మోహనరావు, సోమేశ్వరరరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 01:06 AM