Share News

బీసీల ద్రోహి జగన్‌

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:37 AM

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ను తరిమికొట్టేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు.

బీసీల ద్రోహి జగన్‌

చల్లపల్లి, జనవరి 29 : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ను తరిమికొట్టేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర అన్నారు. జయహో బీసీ సదస్సు సోమవారం రాత్రి స్థానిక ఏటీఎం సెంటరులో జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కొల్లు రవీం ద్ర మాట్లాడుతూ, జగన్‌ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ఎత్తుగడలు వేస్తుంటాడని, బీసీలు ఎవరూ మోస పోవద్దని సూచించారు. బలహీనవర్గాలకు స్వాతంత్య్రం వచ్చింది ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించాకే అన్నారు. వైసీపీ పాలనలో బీసీలను అణిచివేశారన్నారు. పేరుకి 56 కార్పోరేషన్‌లు పెట్టినా రూపాయి నిధులు ఇవ్వలేదనీ, సబ్‌ప్లాన్‌ నిధులూ ఇవ్వలేదన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ, టీడీపీ వచ్చిన తర్వాత 24 శాతం రిజర్వేషన్‌తో బీసీలకు రాజ్యాధికారం కల్పించిందని చంద్రబాబు మరో 10 శాతం పెంచి 34 శాతం రిజర్వేషన్లతో బీసీలకు మరింతగా ప్రాతినిధ్యం కల్పిస్తే, జగన్‌ వచ్చిన తర్వాత 10శాతం తగ్గించి 24 శాతం రిజర్వేషన్‌లతోనే ఎన్నికలు నిర్వహించారన్నారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదన్నారు. . బీసీలు, ఎస్సీలపై వైసీపీ ప్రభుత్వంలో జరిగిననన్ని అత్యాచారాలు, హత్య లు మరే ప్రభుత్వంలోనూ జరగలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఉప్పెన కంటే మిన్నగా దివిసీమలో గ్రామాలు నాశనం అయ్యాయన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు మోర్ల రాంబాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో టీడీపీ రాష్ట్ర నేతలు కొనకళ్ల బుల్లయ్య, బచ్చుల సుబ్రహ్మణ్యం, బొడ్డు వేణుగోపాలరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్‌, నేతలు పైడిపాముల కృష్ణకుమారి, మోర్ల ప్రసాద్‌, లుక్కా పిచ్చియ్య, ఎ.పాండురంగారావు, ఉస్మాన్‌ షరీఫ్‌, మోర్ల జయలక్ష్మి, గొరిపర్తి వెంకటేశ్వరరావు, బొల్లా ఫణి, వెంకటేశ్వరరావు, బోలెం నాగమణి, పిట్టు వెంకటేశ్వరమ్మ, రాజులపాటి అంకమ్మ తదితరులు ప్రసంగించారు. ఉపసర్పంచ్‌ ముమ్మనేని నాని, యార్లగడ్డ శ్రీనివాసరావు తదితర నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. తొలుత మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ బీసీ నేతలు, కార్యకర్తలతో కలిసి పురవీధుల్లో ర్యాలీగా సభావేదికకు వచ్చారు.

అవినీతి పాలకులను సాగనంపండి

పెడన/పెడన రూరల్‌ : అవినీతి జగన్‌ ప్రభుత్వాన్ని సాగనంపాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌ పిలుపునిచ్చారు. గూ డూరు మండలం రాయవరం గ్రామంలో సోమవారం బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎం తైనా ఉందన్నారు. కృష్ణప్రసాద్‌ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను వివరించారు. సాదరబోయిన పోతన స్వామి, గోపీ నాగబాబు, ఎన్‌ఏ బేగ్‌, కాసగాని శ్రీనివాసరావు, సిరివెళ్ళ శ్రీనివాసరావు, శాయన సోమయ్య, బాసంశెట్టి శ్రీనివాసరావు, నందం శివ, భూపతి సాయిప్రకాష్‌ పాల్గొన్నారు.

జగన్‌కు అన్ని వర్గాల ఉసురు : వర్ల

పామర్రు : అన్ని వర్గాల ఉసురు పోసుకుంటున్న జగన్‌ సర్కార్‌ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పామర్రు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్లకుమార్‌రాజా అన్నారు. మండల పరిధిలోని కాపవరం, సప్తాఖాన్‌పాలెం, పెరిశేపల్లి గ్రామాల్లో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. కుదరవల్లి ప్రవీణ్‌ చంద్ర, ఈడే నాని, గొట్టిపాటి లక్ష్మీదాస్‌, మద్దా శ్రీనివాసరావు, మద్దా నిరంజన్‌రావు, కాపవరపు కుటుంబరావు, ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, జన్ను శోభన్‌బాబు, మండపాక శంకర్‌బాబు, పానుగంటి సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:37 AM