జమిలి ఎన్నికలు 2034లోనే: ఎంపీ బాలశౌరి
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:47 AM
2027లో జమిలి ఎన్నికలు జరవగవని ఇప్పటికే స్పష్టం చేశారని ఎంపీ బాలశౌరి తెలిపారు.

మచిలీపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ‘ఒకే దేశం.. ఒకేసారి ఎన్నిక’ల నినాదంలో భాగంగా జమిలి ఎన్నికలు 2034లో జరిగే అవకాశం ఉందని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. జమిలి ఎన్నికలపై నివేదిక తయారుచేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్నిరాష్ర్టాల్లో పర్యటించి అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను, సలహాలను తెలుసుకుని నివేదిక అందజేస్తామన్నారు. ఈ నివేదికలు అందాకనే జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జమిలీ ఎన్నికల నిర్వహణ కమిటీలోని 21 మంది సభ్యులలో తనకు అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. 2027లో జమిలి ఎన్నికలు జరవగవని ఇప్పటికే స్పష్టం చేశారని ఎంపీ తెలిపారు.