జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ కుర్చీ కోసం పోటాపోటీ
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:51 AM
జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ పద వి కోసం టీడీపీలో తీవ్ర పోటీ ఉంది.
టీడీపీ నేతల ముమ్మర ప్రయత్నాలు
(ఆంరఽధజ్యోతి-జగ్గయ్యపేట)
జగ్గయ్యపేట ఏఎంసీ చైర్మన్ పద వి కోసం టీడీపీలో తీవ్ర పోటీ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నియోజకవర్గస్థాయిలో నెం బరు-2 పదవి కావడంతో సీనియర్లు పోటీపడుతున్నారు. గతంలో జగ్గయ్య పేట ఏఎంసీ పరిధిలో జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలు ఉండేవి. పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల్లోని నియోజకవర్గపరిధి గ్రామాలు నందిగామ ఏఎంసీ పరిధిలో ఉండేది. గత వైసీపీ ప్రభుత్వం నియోజకవ ర్గం మొత్తాన్ని ఏఎంసీ పరిధిలోకి తెచ్చింది. దీంతో ఈ పదవికి ప్రాధాన్యం ఏర్పడింది. జగ్గయ్యపేట మండలం నుంచి సీనియర్ నేత, పార్టీ అవి ర్భావం నుంచి కొనసాగుతున్న తెలుగురైతు రాష్ట్ర అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగు యువత మండల అధ్యక్షుడిగా, జిల్లా ఉపాధ్యక్షుడిగా, పార్టీ జిల్లా కార్యని ర్వాహక కార్యదర్శిగా, తెలుగురైతు రాష్ట్ర అధికారప్రతి నిధిగా ఆయన పనిచేశారు. నియోజకవర్గ ముఖ్యనేతలతో పాటు, రాష్ట్రస్థాయి పరిచ యాలు ఆయనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. టీడీపీ వత్సవాయి మండలాధ్యక్షుడు, వత్సవాయి మాజీ సర్పంచ్ వడ్లమూడి రాంబాబు పేరు కూడా వినిపిస్తోంది. టీడీపీ పెనుగంచిప్రోలు మండల అధ్యక్షుడు చింతల సీతారామయ్య కూడా రేసులో ఉన్నారని తెలుస్తోంది. పెనుగంచిప్రోలు మండలానికి రెండు దశాబ్దాలకు పైగా అధ్యక్షుడిగా ఉన్న తనకు పదవి ఇవ్వాలని, తమ మండలానికి ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నట్టు సమాచారం.