Share News

రాష్ట్రాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 01:24 AM

‘‘ఒక్క చాన్స్‌ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గుడు. ప్రజలు మరో అవకాశం ఇవ్వరని జగన్‌కు తెలుసు. ఆ దుర్మార్గుడికి ఒక్క చాన్స్‌ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు బాధప డుతున్నారు. ఆ పొరపాటును సరిదిద్దుకునేందుకు వారంతా ఎదురుచూస్తున్నారు.’’ అని టీడీపీ-జనసేన -బీజేపీ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు.

రాష్ట్రాన్ని నాశనం చేసిన దుర్మార్గుడు జగన్‌
మాట్లాడుతున్న కేశినేని చిన్ని

తిరువూరు ‘నిజం గెలవాలి’ బహిరంగ సభలో కేశినేని చిన్ని విమర్శ

తిరువూరు, ఏప్రిల్‌ 13: ‘‘ఒక్క చాన్స్‌ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గుడు. ప్రజలు మరో అవకాశం ఇవ్వరని జగన్‌కు తెలుసు. ఆ దుర్మార్గుడికి ఒక్క చాన్స్‌ ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు బాధప డుతున్నారు. ఆ పొరపాటును సరిదిద్దుకునేందుకు వారంతా ఎదురుచూస్తున్నారు.’’ అని టీడీపీ-జనసేన -బీజేపీ విజయవాడ పార్లమెంట్‌ అభ్యర్థి కేశినేని శివనాథ్‌(చిన్ని) అన్నారు. శనివారం పట్టణంలో నారా భువనేశ్వరి పాల్గొన్న నిజం గెలవాలి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నిజం, జగన్మోహనరెడ్డి అబద్ధం అన్నారు. ఈ నియోజకవర్గంలో భువనేశ్వరి రెండు రోజులు పర్యటించటం అదృష్టమన్నారు. నిజాయితీపరుడైన చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడంతో 203 మంది టీడీపీ కార్యకర్తలు మరణిస్తే, వారి కుటుంబాలను భువనమ్మ పరామర్శిం చారని, వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారని అన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా తక్షణం అదుకునేది ఎన్టీఆర్‌ ట్రస్టు ఒక్కటేనని అటు వంటి ట్రస్టును నడుపుతున్న మహోన్నత వ్యక్తి భువనమ్మ అని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల గెలుపుతోనే నిజం గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని ఎన్టీఆర్‌జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబుపై పెట్టిన స్కిల్‌ డవలప్‌మెంట్‌ కేసులో ఆధారాలు చూపించలేక ఫైళ్లు తగలబెట్టారని అన్నారు. జనసేన తిరువూరు ఇన్‌చార్జి మనుబోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల సంగ్రామంలో అవినీతి రాక్షస పాలనను అంతమెందించేందుకు జనసైనికులంతా పని చెయ్యాలన్నారు. కూటమి తిరువూరు అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మెట్టప్రాంతమైన తిరువూరులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ ప్రాంత ప్రజలు తాగునీరు లేక కన్నీరు తాగుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. కూటమి విజయంతో అమరావతి రాజదాని అవుతుందని తిరువూరు ప్రాంతంలో విద్యా ఉపాది అవకాశాలు కల్పించేందుకు తాను కృషి చేయడంతో పాటుగా, సాంకేతిక ఉన్నత విద్యా అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సభల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 01:24 AM