Share News

తల్లి, చెల్లికే జగన్‌ న్యాయం చేయలేదు

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:57 AM

‘‘ఇటీవల వైసీపీలో అసమ్మతి నేతల తిరుగుబాట్లు, చెల్లి షర్మిల, తల్లి విజయమ్మలు తీసుకున్న నిర్ణయాలతో సీఎం జగన్‌కు మతి చలించింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. జగన్‌రెడ్డి కుంటుంబంలో అసంతృప్తులకు, టీడీపీకి ఏం సంబంధం? తన ఇంటి పంచాయితీని పరిష్కరించుకోలేక తన అసమర్థతను చంద్రబాబుపైకి నెట్టి ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్ని స్తున్నారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం న్యా యం చేస్తాడు?’’ అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తల్లి, చెల్లికే జగన్‌ న్యాయం చేయలేదు
పోరంకిలో బాబు ష్యూరిటీ-భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న బోడె ప్రసాద్‌

ఇక ప్రజలకేం చేస్తారు: బోడె ప్రసాద్‌

పెనమలూరు, జనవరి 4: ‘‘ఇటీవల వైసీపీలో అసమ్మతి నేతల తిరుగుబాట్లు, చెల్లి షర్మిల, తల్లి విజయమ్మలు తీసుకున్న నిర్ణయాలతో సీఎం జగన్‌కు మతి చలించింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. జగన్‌రెడ్డి కుంటుంబంలో అసంతృప్తులకు, టీడీపీకి ఏం సంబంధం? తన ఇంటి పంచాయితీని పరిష్కరించుకోలేక తన అసమర్థతను చంద్రబాబుపైకి నెట్టి ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్ని స్తున్నారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఏం న్యా యం చేస్తాడు?’’ అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పోరంకి 5వ వార్డులో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. అనుమోలు ప్రభాకరరావు, సంగెపు రంగారావు, బోడె సురేంద్ర, ముక్కామల నాని, సలీం, వంగూరు పవన్‌, రావి రాకేష్‌ పాల్గొన్నారు.

బోడె హేమ ఆధ్వర్యంలో..

తాడిగడపలో పది రోజులుగా బోడె ప్రసాద్‌ సతీమణి బోడె హేమ ఆధ్వ ర్యంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరిం చారు. తెలుగు మహిళా నేతలు, స్థానికులు ఉన్నారు.

యనమలకుదురులో..

యనమలకుదురులో టీడీపీ నేతలు మొక్కపాటి శ్రీనివాస్‌, అనంతనేని ఆజాద్‌, శొంఠి శివరాంప్రసాద్‌ నేతృత్వంలో బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరంకి కుటుంబరావు, ఆరేపల్లి వెంకటేశ్వరరావు, తుమ్మల కిషోర్‌, తమ్ము అశోక్‌, బలగం నాగరాజు, కళ్యాణపు శ్రీనివాస్‌, వెలగపూడి శేఖర్‌, మాచిన శివ, గండికోట శ్రీను, జన్ను నాగరాజు, మల్లంపాటి విజయలక్ష్మి, పండల రజిని, సయ్యద్‌ షాహీనా తదితరులు పాల్గొన్నారు.

చెత్తపైనే పన్ను వేసిన ప్రభుత్వమిది

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: ‘‘వైసీపీ పాలనలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన శూన్యం. చెత్తపైనా పన్ను వేసిన ప్రభుత్వమిది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, ఇప్పటి ప్రభుత్వంలో వడ్డింపులను దృష్టిలో పెట్టుకుని భావితరాల భవిష్యత్తు కోసం టీడీపీకి మద్దతు పలకండి. పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం.’’అని టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వేగిరెడ్డి పాపారావు అన్నారు. టీడీపీ పెరికీడు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం గ్రామంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీటీసీ మాజీ సభ్యు రాలు బేతాళ ప్రమీలారాణితో కలిసి పాపారావు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామ కమిటీ అధ్య క్షుడు రాజులపాటి శ్రీనివాసరావు, గొట్టాపు ప్రవీణ్‌, పోతుల సురేష్‌, పొత్తూరి రేఖ తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతోనే సంక్షేమం, అభివృద్ధి

ఉయ్యూరు: సంక్షేమం, అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆ పార్టీ నాయ కులు అన్నారు. ఉయ్యూరు నగరపచాయతీ పరిధి 262 బూత్‌లో గురు వారం మాజీ కో-ఆప్షన్‌ సభ్యుడు నజీర్‌, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ కూనపరెడి ్డ వాసు, పట్టణ అధ్యక్షుడు జంపాన గుర్నాథరావులు బాబు ష్యూరిటీ -భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మినీమేనిఫెస్టోలోని సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి, ప్రతికుటుంబానికి కలిగే లబ్ధిని వివరించారు. రాష్ట్రంలో వైసీపీ అరాచక, అవినీతి పాలనతో ప్రజలు విసిగి పోయారని, నిత్యావసరాలతో పాటు అన్ని ధరలు పెరిగి ప్రజ లు ఇబ్బం దులు పడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుం టున్నారని తెలిపారు. పార్టీ పట్టణ కార్యదర్శి పండ్రాజు చిరంజీవి పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:57 AM