Share News

జగన్‌తో ఢిల్లీలో ధర్నా చేయించింది మోదీనే: చింతా మోహన్‌

ABN , Publish Date - Jul 28 , 2024 | 01:02 AM

ప్రధాని మోదీకి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బిడ్డలాంటోడని, ఆయన అనుమతిచ్చి ఢిల్లీలో జగన్‌తో ధర్నా చేయిం చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఆరోపించారు.

 జగన్‌తో ఢిల్లీలో ధర్నా చేయించింది మోదీనే: చింతా మోహన్‌

ధర్నాచౌక్‌, జూలై 27: ప్రధాని మోదీకి వైసీపీ అధ్యక్షుడు జగన్‌ బిడ్డలాంటోడని, ఆయన అనుమతిచ్చి ఢిల్లీలో జగన్‌తో ధర్నా చేయిం చారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌ ఆరోపించారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. జగన్‌ ఎందుకు ధర్నాచేశావ్‌? ఓడిపోయినం దుకా..సానుభూతి కోసమా? అని ప్రశ్నించారు. ఢిల్లీ ధర్నాతో జగన్‌ అభాసుపాలయ్యారన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో సీఎం చంద్రబాబును కొట్టాడని జగన్‌ వ్యాఖ్యానించడం అబద్ధమన్నారు. వారిద్దరు చదువుకునే రోజుల్లో చెరొక గ్రూపునకు నాయకత్వం వహిం చేవారన్నారు. ఒక్క ఛాన్స్‌ అని అడిగిన జగన్‌కు ప్రజలు ఒక్కచాన్స్‌ ఇచ్చారన్నారు. అమరావతి, పోలవరం నిర్మాణానికి కేంద్ర బడ్జెట్‌లో ఒక్క పైసా గ్రాంట్‌గా నిధులు మంజూరు చేయలేదన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు అప్పు ఇప్పిస్తామని చెప్పడం బీజేపీ ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శన మన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పక్క రాష్ట్రాల్లో నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్ర అప్పులపై వాస్తవాలు తెలిపేందుకు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు బాహుబలి అయ్యారన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 01:02 AM