Share News

రాష్ట్రంలో సుపరిపాలనకు శ్రీకారం

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:58 AM

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు శ్రీకారం చుట్టిందని టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నా రు.

రాష్ట్రంలో సుపరిపాలనకు శ్రీకారం
జగ్గయ్యపేటలో కేక్‌ కట్‌ చేస్తున్న నెట్టెం రఘురాం

ప్రజాభీష్టానికి అనుగుణంగా చంద్రబాబు పాలన: నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట, జూన్‌ 16: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు శ్రీకారం చుట్టిందని టీడీపీ విజయవాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నా రు. తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, మనో భీష్టానికి అనుగుణంగా సీఎం చంద్ర బాబు, తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే 5 జీవోలపై సంతకం చేశా రన్నారు. రాష్ట్రానికి శనిలా దాపురించిన వైసీపీ ఐదేళ్లలో సాగించిన అరాచక, తిరోగ మన పాలన దిశను పురోగమనంలోకి చంద్రబాబు తొలిరోజే మార్చారని, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగుతోందని ఆయన తెలిపారు. నెట్టెం కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర నేత ముల్లంగి రామకృష్ణారెడ్డి, గింజుపల్లి రమేష్‌, కన్నెబోయిన రామలక్ష్మి, సయ్యద్‌ అన్వర్‌, రేపాల కాంతారావు, కె.సూర్యప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:58 AM