అప్పుల ఆంధ్రగా రాష్ట్రం
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:46 AM
అప్పుల ఆంధ్రగా మార్చి రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనుడు సీఎం జగన్‌రెడ్డి అని, ఆయ నను ఇంటికి పంపి వెలుగులు నింపే చంద్రబాబును సీఎంను చేసేందుకు అందరు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సతీమణి బోడె హేమ పిలుపునిచ్చారు.
కంకిపాడు, మార్చి 7: అప్పుల ఆంధ్రగా మార్చి రాష్ర్టాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనుడు సీఎం జగన్‌రెడ్డి అని, ఆయ నను ఇంటికి పంపి వెలుగులు నింపే చంద్రబాబును సీఎంను చేసేందుకు అందరు సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సతీమణి బోడె హేమ పిలుపునిచ్చారు. నెప్పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన బాబు ష్యూరిటీ-భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఐదే ళ్లలో రాష్ర్టానికి ఒక పరిశ్రమ కూడా రాలేదన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్ చంద్రబాబుతోనే ఉందన్నారు. టీడీపీ- జన సేన కూటమిని బలపర్చాలని నియోజకవర్గంలో టీడీపీ జెండా రెపరెపలాడాలని ప్రజలను కోరారు. కొలుసు గోవింద రావు, కొలుసు రాజేశ్వరి, సంగెపు రంగారావు, కోలవెన్ను శివరాం, కోల వెన్ను ఉషారాణి, ఈడ్పుగంటి నాని, లోయ జోజిబాబు, చింత పల్లి కోటేశ్వరరావు, కోలవెన్ను గోపీచంద్, ఎ.నాని పాల్గొన్నారు.