Share News

ఐదేళ్లయినా అసంపూర్తిగానే..

ABN , Publish Date - May 29 , 2024 | 01:28 AM

అంతర్జాతీయ విమానాశ్రయంలో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు ఐదేళ్లు దాటినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనుల్లో పురోగతి లేకుండా పోయింది. ఐదేళ్ల కిందట తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కాంట్రాక్టు సంస్థకు నిర్దేశించిన చివరి గడువు జూన్‌ 31 సమీపిస్తోంది. ఇప్పటికి 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్ణీత రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పనులు ఐదేళ్లు దాటినా పూర్తి కాకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

ఐదేళ్లయినా అసంపూర్తిగానే..

సగం పనులు కూడా జరగని ఎయిర్‌పోర్టు

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణం

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడిగా భూమిపూజ

2020-21లో పనులకు శ్రీకారం

ఇప్పటి వరకు పూర్తికాని పరిస్థితి

అంతర్జాతీయ విమానాశ్రయంలో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు ఐదేళ్లు దాటినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనుల్లో పురోగతి లేకుండా పోయింది. ఐదేళ్ల కిందట తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కాంట్రాక్టు సంస్థకు నిర్దేశించిన చివరి గడువు జూన్‌ 31 సమీపిస్తోంది. ఇప్పటికి 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్ణీత రెండేళ్లలో పూర్తి చేయాల్సిన పనులు ఐదేళ్లు దాటినా పూర్తి కాకపోవటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అమరావతి రాజధానిగా ప్రకటించిన అనంతరం నవ్యాంధ్రకు విజయవాడ విమనాశ్రయం తలమానికంగా మారింది. 2017 మే 3వ తేదీన అంతర్జాతీయ విమానాశ్రయం హోదాను సాధించింది. విమానాశ్రయంలో ఉన్న పాత టెర్మినల్‌ను అధునీకరించి కొద్ది కాలం వాడిన తర్వాత.. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నేతృత్వంలో నూతన ఇంటీరియం టెర్మినల్‌ బిల్దింగ్‌ను రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులను నిరంతరం సమీక్షించేది. దీంతో రికార్డు స్థాయిలో ఏడాదిలోనే పనులు పూర్తయ్యాయి. తాత్కాలిక అవసరాల కోసం దీన్ని నిర్మించినా విజయవాడ విమానాశ్రయం నుంచి విమానయానం పుంజుకోవటంతో అనూహ్యంగా శాశ్విత ప్రాతిపదికన నిర్మించాల్సిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు కూడా ఏఏఐ శ్రీకారం చుట్టింది.

2018లో మొదలై..

కేంద్ర ప్రభుత్వం రూ.641 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రాజెక్టును 2018లోనే మంజురు చేసింది. అప్పట్లో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనుల కోసం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కమిటీ (పీఎంసీ)గా ‘స్టుప్‌’అనే సంస్థను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. విమానాశ్రయ డిజైన్‌ రూపకల్పన దగ్గర నుంచి, టెండరింగ్‌ ప్రక్రియ నిర్వహించటం, పనుల పర్యవేక్షణ తదితరాలను పీఎంసీగా నియమితమైన ‘స్టుప్‌’ సంస్థ చేపట్టవలసి ఉంది. ఆ తర్వాత ఏడాది పాటు డిజైన్ల రూపకల్పనతోనే సరిపోయింది. ఏడాది వరకు టెండర్ల స్టేజీకీ రాకపోవటంతో విమర్శలు వచ్చాయి. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు - 2019కు ముందు వారం రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువ డుతుందనుకుంటున్న సందర్భంలో హడావిడిగా కేంద్ర ప్రభుత్వం వర్చువల్‌గా ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేసింది. అప్పటికీ ఈ ప్రాజెక్టుకు ఇంకా టెండర్లు పిలవలేదు. అనంతరం ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. ఎన్‌కేజీ గ్రూపు సంస్థ ఈ ప్రాజెక్టు టెండర్లను దక్కించుకుంది. ఆ తర్వాత కాంట్రాక్టు సంస్థతో అగ్రిమెంట్‌కావటానికి కొంత కాలం పట్టింది.

2019 చివర్లో పనులు మొదలు..

2019 చివర్లో పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 2020లో కరోనా మొదలైంది. కరోనా కాలంలో లాక్‌డౌన్ల కారణంగా అర్ధ సంవత్సరం కాలం పాటు పనులు సాగలేదు. ఆ తర్వాత అవరోధం లేకున్నా పనులు ముందుకు సాగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనులు అయితే సాగుతున్నాయి కానీ.. పురోగతి మాత్రం ఉండటం లేదు. లెక్క ప్రకారం రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఐదేళ్లు దాటి నా కూడా సగ శాతం పనులే పూర్తయ్యాయి.

ఐదేళ్లుగా సమీక్ష లేదు..

రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులపై సమీక్ష చేసిన పాపాన పోలేదు. మచిలీపట్నం పార్లమెంట్‌ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అప్పుడప్పుడు సమీక్షలు చేసేవారు. ఆయన చివరి సమీక్షా సమావేశంలో జూన్‌ 31 నాటికి పూర్తి చేస్తామని ఏఏఐ తరపున హామీ ఇచ్చారు. జూన్‌ 31 సమీపిస్తున్నా పనులు పూర్తి కాలేదు. జీ ప్లస్‌ 1 పనులు కూడా పూర్తిగా జరగలేదు. మిగిలిన సగం పనులు పూర్తి కావాలంటే ఇంకెంత కాలం పడుతుందో వేచి చూడాల్సిందే.

ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రత్యేకతలు ఇవీ

ఈ టెర్మినల్‌ను అంతర్జాతీయ, దేశీయ అవసరాల రెండింటికీ ఏకకాలంలో ఉపయోగిస్తారు. ఒకేసారి 800 మంది దేశీయ ప్రయాణికులు, 400 మంది విదేశీ ప్రయాణికులను హ్యాండ్లింగ్‌ చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఆధునిక బ్యాగేజీ హ్యాండ్లింగ్‌ సిస్టమ్‌, అరైవల్‌ బ్యాగేజీ క్లెయిమ్‌ క్లారోసెల్స్‌, సెంట్రల్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, ఫ్లైట్‌ ఇన్ఫర్మేషన్‌ బోర్డులు, చెక్‌ ఇన్‌ కౌంటర్స్‌, కామన్‌ యూజ్‌ టెర్మినల్‌ ఎక్విప్‌మెంట్‌ ్స వంటివి ఉంటాయి.

Updated Date - May 29 , 2024 | 01:28 AM